Breaking News

సచివాలయ ఉద్యోగుల ఉద్యమ పిడికిలి

Published on Sun, 09/07/2025 - 03:42

సాక్షి, అమరావతి/ భీమవరం (ప్రకాశం చౌక్‌):  గ్రామ/­వార్డు సచివాలయ ఉద్యోగులు పోరుబావుటా ఎగరవేశారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలను అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను అధికారంలోకి రాగానే రద్దు చేసిన కూటమి ప్రభుత్వం... తాజాగా వలంటీర్ల బాధ్యతలను గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అంటగట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పట్లో ఉన్న వలంటీర్ల క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు కేటాయించాలని జిల్లాలకు సమాచారమిచ్చింది. గతంలో 50 ఇళ్లకు ఓ వలంటీర్‌ను నియమించి క్లస్టర్లుగా విభజించగా, ఇప్పుడు నాలుగైదు క్లస్టర్లను ఓ సచివాలయ ఉద్యోగికి కేటాయించి సమాచార సేకరణ, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. 

ఇందుకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆన్‌లైన్‌ లింకును ఏర్పాటు చేయడంతోపాటు వలంటీర్ల క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు ఎలా మ్యాపింగ్‌ చేయాలో తెలిపే ఛార్ట్‌ ఫ్లోనూ శుక్రవారం సాయంత్రమే అన్ని సచివాలయాలకూ చేరవేసింది. దీనిపై సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కూటమి సర్కారు తీరు తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆందోళనే శరణ్యమని పోరుబావుటా ఎగరవేశారు.  

జూమ్‌ మీట్‌లో ఉద్యమానికి సిద్ధం  
సర్కారు తీరుపై శుక్రవారం రాత్రి అత్యవసరంగా జూమ్‌ యాప్‌లో వర్చువల్‌గా సమావేశమైన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు జేఏసీగా ఏర్పడి ఉద్యమం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. వాట్సాప్‌ సేవలపై శనివారం ఇంటింటి ప్రచారం చేయాలని, ర్యాలీలు చేపట్టాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బహిష్కరించాలని తీర్మానించారు. 

ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని సచివాలయ ఉద్యోగులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. పలుచోట్ల సమస్యలపై ఎంపీడీవోలకు, మున్సిపల్‌ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశారు. భీమవరంలో 40 వార్డుల సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ మున్సిపల్‌ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)