Breaking News

10న సచివాలయ ఉద్యోగుల ‘విజయవాడ మార్చ్‌’

Published on Mon, 09/29/2025 - 06:01

సింహాచలం (విశాఖ): రాష్ట్ర ప్రభుత్వం తమ న్యా­య­మైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేక­పోతే అక్టోబర్‌ 10వ తేదీన లక్ష మంది గ్రామ, వార్డు సచి­వాలయాల ఉద్యోగులతో విజయవాడ మార్చ్‌ ని­ర్వ­హిస్తామని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచి­వాలయ ఉద్యోగుల ఐక్యవేదిక (జేఏసీ) ప్రకటించింది. విశాఖపట్నంలోని సింహాచలంలో ఆదివారం ఆంధ్ర­ప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ జానీ పాషా మాట్లా­డుతూ వలంటీర్ల విధులను గ్రామ, వార్డు సచి­వా­లయ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వర్తించబో­రని స్పష్టం చేశారు.

తక్షణమే ఇంటింటి సర్వే విధుల నుంచి సచివాలయ ఉద్యోగులను తప్పించాలని డి­మాండ్‌ చేశారు. నోషనల్‌ ఇంక్రిమెంట్లు, 9 నెలల అరి­యర్స్‌ను వెంటనే మంజూరు చేయా­లన్నారు. ఆరేళ్లు సర్వీç­Üు పూర్తయిన ప్రతి సెక్రటరీకి ఏఏఎస్‌ ఇంక్రి­మెంట్‌ వర్తింపజేయాలని, ఉద్యోగులందరికీ జూని­యర్‌ అసిస్టెంట్‌ స్కేల్‌కు అప్‌గ్రేడ్‌ చేసి ప్రమోషన్‌ చానల్‌ కల్పించాలని, జాబ్‌ చార్ట్‌ను తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్‌ విప్పర్తి విఖిల్‌ కృష్ణ, కన్వీనర్‌ అబ్జుల్‌ రజాక్, అర్గనైజింగ్‌ సెక్రటరీ వెస్లీ, కో–చైర్మన్లు భార్గవ్‌ సుతేజ్, అంకమ్మరావు, రాజేష్, వైస్‌ చైర్మన్లు శ్రీని­వా­స్, నాగే­శ్వ­ర­రావు, గ్రేటర్‌ విశాఖ జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)