Breaking News

సెలవులకు ‘సర్వే’మంగళం

Published on Sun, 08/10/2025 - 05:44

సాక్షి, అమరావతి: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు సెలవు రోజుల్లోనూ పనిభారం తప్పడం లేదు.  పీ–4 కార్యక్రమంలో భాగంగా వారి చేత ఇప్పటికే మూడు, నాలుగు రకాల సర్వేలు చేయిస్తున్న ప్రభుత్వం తాజాగా నీడ్‌ అసెస్‌మెంట్‌ సర్వే పేరిట రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన దాదాపు 24 లక్షల కుటుంబాలకు ఏ రకమైన తొడ్పాటు కావాలో సమాచారం సేకరించాలని ఆదేశించింది. 

ప్రస్తుతం శ్రావణ శుక్రవారం, రెండో శనివారం, ఆదివారం వరుసగా సెలవులు రావడంతో ఈ రోజుల్లో ఈ సర్వేను పూర్తిచే­యాలని హుకుం జారీచేసింది. దీంతో ఉద్యోగులు సెలవులు తీసుకోకుండా అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సర్వేపై సీఎంతో కలెక్టర్ల సమావేశం ఉంటుందని, చెప్పిన సమయానికి సర్వే పూర్తిచేయాల్సిందేనని, లేకుంటే సస్పెన్షన్‌ వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు ఉద్యో­గులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీ–4 కార్య­క్రమంలోనే తొలుత పేదల(బంగారు కుటు­ంబాలు) గుర్తింపు, తర్వాత దత్తత తీసుకునే మార్గదర్శకుల గుర్తింపు సర్వేలు చేపట్టిన సర్కా­రు మార్గదర్శకులు దొరకకుంటే సచివాలయ ఉద్యోగులే పేదలను దత్తత తీసుకోవా­లని ఒత్తిడి తెచ్చింది. 

ఈ నేపథ్యంలో తాజాగా గుర్తించిన బంగారు కుటుంబాలకు ఎలాంటి సాయం కావాలో నిర్ధారించే కార్యక్ర­మం చేపట్టింది. ఈ సర్వేను శుక్ర, శని, ఆదివారాల్లోనే పూర్తిచేయాలని,, లేకుంటే ఉద్యోగాలు పీకేస్తామంటూ జిల్లా అధికారులు పెట్టే టార్చర్‌ భరి­ంచలేకపోతున్నామని ఉద్యోగులు లబోదిబోమ­ంటున్నారు. 

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)