Breaking News

సచివాలయ ఉద్యోగులకు మద్యం షాపుల ఫొటోలు తీసే బాధ్యత

Published on Wed, 10/15/2025 - 05:19

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో పనిభారం విపరీతంగా పెరిగిపోయి ,తీవ్ర ఒత్తిడిలో ఉన్న గ్రామ,వార్డు సచివాలయ సిబ్బందిపై ప్రభుత్వం మరింత భారం వేసింది. నకిలీ మద్యం తయారీతో రాష్ట్రం అట్టుడికిపోతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మద్యం షాపుల ఫొటోలు తీసే బాధ్యతలను అప్పగించింది. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ, పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆడ్మిన్‌ సెక్రటరీలు వారి పరిధిలో ఉండే (లైసెన్స్‌డ్‌) మద్యం షాపులను ఫొటోలు తీయడంతో పాటు షాపు జియో కోఆర్డినేట్స్‌ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలంటూ ఆదేశాలు వెళ్లాయి. 

మంగళవారం ఉదయాన్నే పలు జిల్లాల్లో గ్రామ, వార్డు సచివా­లయ శాఖ అధికారులు పంచాయతీ కార్యద­ర్శు­లు, వార్డు అడ్మిన్‌ సెక్రటరీలకు సమాచారమిచ్చారు. గ్రా­మ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న చోట ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందిలో వేరొక పురుష ఉద్యోగి ఆ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. 

దీంతో ఉద్యోగ సంఘాలు కూ­ట­మి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉద్యోగులతో మద్యం షాపుల ఫొటోలు తీయించడం ఏంటని మండిపడుతున్నాయి. దీనివల్ల ఏం ప్రయోజనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెల్టుషాపుల కట్టడికి చర్యలు మానేసి ఇంత హడావుడిగా జియో ట్యాగింగ్‌ ఎందుకు చేయిస్తున్నారని విమర్శిస్తున్నాయి.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)