Breaking News

సచివాలయ ఉద్యోగుల ఆందోళన ఉధృతం

Published on Tue, 09/30/2025 - 02:22

సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారం కోసం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆందోళన ఉధృతమవుతోంది. ఉద్యోగ సంఘాల పిలుపుమేరకు గ్రామ, వార్డు సచి­వాలయ ఉద్యోగులు అధికారిక వాట్సాప్‌ గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ అయ్యారు.  సెప్టెంబర్‌ 23వ తేదీ నుంచి  ప్రతిరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. అయితే, ఉద్యోగ సంఘాలు నిరసన నోటీసులిచ్చిన అనంతరం గత బుధవారం ఉద్యోగులను చర్చలకని పిలిచి, తర్వాత ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. 

ఉద్యోగులు మాత్రం తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అక్టోబర్‌ 1న పింఛన్ల పంపిణీలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీ­లు ధరించి పాల్గొననున్నట్టు ఉద్యోగ సంఘా­ల ఐక్యవేదిక ప్రకటించగా, మరో ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తాము పింఛన్ల పంపిణీని  బహిష్కరిస్తామని ప్రకటన జారీ చేసింది.  

వలంటీర్ల విధులు మేం చేయం  
చిత్తూరు కలెక్టరేట్‌: ‘వలంటీర్లు చేయాల్సిన పనులను కూటమి ప్రభుత్వం మాకు అప్పగించడం సరికాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేం వలంటీర్ల విధులను నిర్వహించం. ఈ ప్రభు­త్వం సర్వేల పేరుతో ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఇంటింటి సర్వే నుంచి మాకు విముక్తి కల్పించాలి’ అని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఉద్యోగులు సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. 

అనంతరం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాందీకి వినతిపత్రం అందజేశారు. జేఏసీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వలంటీర్‌ పనులు అప్పగించడం అన్యాయమన్నారు. వలంటీర్లు చేసిన పనులన్నీ తాము చేయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. 

జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మహేష్‌ మాట్లాడుతూ సర్వేల పేరుతో సచివాలయ ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూడటం తగదన్నారు. ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగానే సచివాలయాల ఉద్యోగులకు కూడా పదోన్నతుల కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)