Breaking News

సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Published on Thu, 01/29/2026 - 05:13

నంద్యాల(అర్బన్‌): గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ సచివాలయ భవనం పైఅంతస్తుకు వెళ్లి కత్తితో ఎడమ చేయి మణికట్టు, గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన నంద్యాల మండలం బిల్లలాపురం సచివాలయ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కురువ పిడుగు చిన్ననాగన్న, మల్లమ్మ కుమారుడు మధుశేఖర్‌ నెహ్రూనగర్‌ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ ఆర్నెల్ల కిందట  నుంచి నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయానికి బదిలీపై వచ్చాడు. 

బుధవారం విధుల్లో ఉన్న మధుశేఖర్‌ భోజనం సమయంలో బాత్‌రూంకు వెళ్లి వస్తానంటూ తోటి సిబ్బందితో చెప్పి సచివాలయ భవనం పైఅంతస్తుకు వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో ఉద్యోగులు వెళ్లి చూడగా మధుశేఖర్‌ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చాకుతో చేతి మణికట్టు, గొంతు కోసుకోవడంతో రక్తసిక్తమైంది. వెంటనే వారు 108కు ఫోన్‌ చేసి, అనంతరం ఎంపీడీఓకు సమాచారం అందించారు. 

చికిత్స నిమిత్తం మధుశేఖర్‌ను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి్పంచారు. ఆత్మహత్యాయత్నానికి పని ఒత్తిడితో పాటు ఆరి్థక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ సీఐ ఈశ్వరయ్య తెలిపారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)