Breaking News

నేను చెప్పిందే ఫైనల్‌

Published on Sun, 12/29/2024 - 05:12

సాక్షి తిరుపతి టాస్క్‌ఫోర్స్‌: ‘మైకా క్వార్ట్జ్‌ ఎంత తవ్వితే అంత మొత్తం నాకే అమ్మాలి. అదీ నేను చెప్పిన ధరకే. లేదంటే మైనింగ్‌ జరగదు. నా మా­ట ప్రకారం నడుచు­కోవాల్సిందే. నేను చెప్పిందే ఫైన­ల్‌’.. తిరుపతి–­నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో విలు­వైన మైకా క్వార్ట్జ్‌ గనుల యజమానులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలివి. ప్రభుత్వంలోని ఒక ము­ఖ్య నేత అండదండలతో సైదాపురం, గూడూరు పరిధిలో లభ్యమయ్యే విలువైన తెల్లబంగారం మొత్తాన్ని ఆయన గుప్పిట్లోకి తీసు­కోవ­డానికి చేస్తున్న ప్రయ­త్నా­లు లీజుదారులు తీవ్రంగా వ్యతి­రేకిస్తున్నారు.

ఆయనపై తిరుగుబా­టుకు సిద్ధమ­య్యారు. శనివా­రం తిరుపతి జిల్లా గూడూరు ని­యోజ­కవర్గం చిల్లకూ­రులోని ఓ కన్వెన్షన్‌లో రహ­స్యంగా సమా­­వేశమై కార్యాచర­ణను రూపొందించుకున్నారు. ఆయన ఒక్కరికే విక్రయిస్తే నష్టపో­తామని, అలా కా­కుండా ఎక్కువ రేటు ఇచ్చిన వారికి విక్రయిస్తే ప్ర­యో­జనం ఉంటుందని వారు ఓ నిర్ణయానికి వచ్చి­నట్లు విశ్వస­నీయ సమాచారం. ఈ విషయమై ప్రభు­త్వ పెద్ద­లు, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే­లతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిసింది.

సైదాపురం, గూడూరు, పొదల­కూరు పరిధి­లో ఏడు భూగర్భ గనులు, మరో 140 మైకా క్వార్ట్జ్‌ , క్వార్ట్జ్‌  గనులున్నాయి. మైకా క్వార్ట్‌ ్జకి  అంతర్జాతీయ మార్కె­ట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. చైనా, జపాన్, రష్యా దేశాల్లో రూ.లక్షలు పెట్టి కొంటున్నారు. విలుౖ­వె­న మైకా క్వార్ట్జ్‌ పై అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, మరి కొందరు ఎమ్మెల్యే­లు కన్నేశారు. కూట­మి అధికా­రంలోకి వచ్చిన వెంటనే గనుల్లో తవ్వ­కా­లు నిలిపే­శారు. ఆ తరువాత వారికి అనుకూ­లంగా ఉన్న వారికే తవ్వకాలకు అనుమతులిచ్చారు. ఇలా ఇప్పటివరకు 24 గనులకు  అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది.

మైనింగ్‌ డాన్‌కు అమ్మడం ఇష్టంలేక తవ్వకాలు నిలిపివేత
ఇక్కడ తవ్విన మైకా క్వార్ట్జ్‌ మొత్తం తనకే విక్రయించాలని, తాను చెప్పిన రేటుకే ఇవ్వాలంటూ మైనింగ్‌ డాన్‌ లీజుదారులకు హుకుం జారీ చేశారు. తనను కాదని వేరొకరికి విక్రయించడానికి వీల్లేదని ఆదేశించారు. దీంతో కంగుతిన్న లీజుదా­రు­లు తవ్వకాలు నిలిపి­వేశారు. అనుమతులిచ్చిన గనుల్లో ప్రస్తుతం నాలుగింట్లోనే తవ్వకాలు జరు­గుతున్నాయి. ఈ దందా భరించలేని లీజుదారులు 32 మంది చిల్లకూరు­లోని ఓ కన్వెన్షన్‌లో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రహస్యంగా సమావేశమ­య్యా­రు.

సమావేశంలో విష­యాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు అందరి నుంచి మొబైల్‌ ఫోన్లు కూడా తీసేసు­కున్నారు. మైకా క్వార్ట్జ్‌ మంచి డిమాండ్‌ ఉన్నందున, బయట అమ్మితేనే లాభమని, డాన్‌కి అమ్మితే నష్టమేనని వారు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు కొంత మైనింగ్‌ డాన్‌కి విక్రయించినా.. మరి కొంత ఇతరులకు విక్రయిస్తే కొంతైనా ప్రయోజనం ఉంటుందని భావించినట్లు తెలిసింది. ఈయనతోపాటు సూ­ళ్లూ­రుపేట, గూడూ­రు, వెంకటగిరి, సత్య­వేడు నియోజకవ­ర్గాలను శాసిస్తున్న మరో బడా పారి­శ్రామికవేత్తకు కూడా విక్రయిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు సమా­చారం.

ఒకటి, రెండు రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే­లు, ఓ పారిశ్రామికవేత్త, ప్రభుత్వ పెద్దలతో చర్చించాలని నిర్ణయించుకు­న్నారు. అదేవిధంగా జిల్లా మైనింగ్‌ అధికారిని కూ­డా మరోసారి కలిసి తమ ఆవేదన­ను చెప్పు­కోవా­లని నిర్ణయానికి వచ్చారు. ఈ రహస్య సమావేశం విషయం తెలుసుకున్న మైనింగ్‌ డాన్‌ లీజుదా రులతో మాట్లాడినట్లు తెలిసింది. ఎవరె­వరు తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఎంత­మంది అనుకూలంగా మాట్లాడారు అనే విషయా­లపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ సమావేశం వివరాలను ప్రభుత్వ పెద్దలు కూడా నిఘా వర్గాల ద్వారా తెప్పించుకున్నట్లు తెలిసింది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)