Breaking News

చిన్నారికి టీకా

Published on Wed, 11/12/2025 - 05:59

మహారాణిపేట: పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఎదిగితేనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుంది. పూర్వం పురిట్లోనే ప్రాణాలు వదలడం, మాతాశిశు మరణాలు ఉండేవి. చిన్నారి ఎదిగే క్రమంలో అంతుచిక్కని రోగాల బారిన పడి మృత్యువాత పడేవారు. వైద్య విజ్ఞానం అప్పట్లో అంతగా అభివృద్ధి చెందకపోవడంతో కుటుంబాల్లో జననాల సంఖ్య పెంచుకునే వారు. 

ప్రస్తుతం వైద్య రంగంలో పెను మార్పులు వచ్చాయి. శాస్త్ర, పరిశోధనలు అనేక రోగాల నివారణకు అద్భుత ఔషధాలను తెచ్చాయి. పుట్టిన క్షణం మొదలు పిల్లలకు 16 ఏళ్లు వచ్చే వరకు ఆరోగ్య శాఖ వేస్తున్న టీకాలతో ఆరోగ్యవంతంగా ఎదిగి వారంతా రేపటి పౌరులుగా మారుతున్నారు.

అపోహలు వీడదాం.. ఆరోగ్యాన్ని కాపాడుదాం 
వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ వివిధ వయసులో టీకాలు కచ్చితంగా వేయించుకోవాలి. అప్పుడే రోగనిరోధక శక్తి పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ టీకాలపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. 

టీకాలు వేయించడం ద్వారా జ్వరాలు రావడం, బలహీనపడతారని అపోహలతో వాటికి దూరంగా ఉంటున్నారు. టీకాలపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్‌ 10న అంతర్జాతీయ టీకాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘అందరికీ రోగ నిరోధకత మానవులకు సాధ్యమే’అనే థీమ్‌తో ముందుకెళ్తున్నారు.  

ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం 
టీకాలు మన ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం లాంటివి. స్మాల్‌ ఫాక్స్, పోలియో వంటి వ్యాధులను నిర్మూలించిన టీకాలు.. కోట్లాది ప్రాణాలను రక్షించాయి. టీకాలు అందరికీ చేరినప్పుడే సమగ్ర రోగనిరోధకత సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్‌ ఇమ్యునైజేషన్‌ ప్రొగ్రామ్‌ కింద ఏటా లక్షలాది శిశువులకు, గర్భిణులకు ఉచిత టీకాలను అందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఆరోగ్య కార్యక్రమంగా నిలుస్తోంది. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎం, నర్సులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.  

ఏ టీకా.. ఎప్పుడు వేయాలి ?
ప్రసవం నుంచి 24 గంటలు: టీబీ నుంచి రక్షణకు బీసీజీ, పోలియో నివారణకు ఓపీవీ జిరో డోసు, కామెర్ల వ్యాధి అరికట్టేందుకు హెపటైటిస్‌–బి 

45 రోజులకు: పోలియో నివారణకు ఓపీవీ–1, ఓపీవీ–2, ఓపీవీ–3, ఐపీవీ 

75 రోజులకు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, మెదడువాపు, న్యూమోనియా నివారణకు పెంటావాలెంట్‌–1, 2, 3 

105 రోజులకు: తీవ్ర నీళ్ల విరోచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి, మూత్ర విసర్జన, బరువు తగ్గడం వంటి సమస్యల నివారణకు ఆర్‌వీవీ–1, 2, 3 

9–12 నెలలకు: తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణకు ఎంఆర్‌–1, అంధత్వ నివారణకు విటమిన్‌–ఎ, మెదడువాపు నివారణకు జేఈ–1, దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బందుల నివారణకు ఎఫ్‌ఐవీవీ–3, పీసీవీ–బీ 

16–24 నెలలు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు డీపీడీ–1 బూస్టర్, పోలియో నివారణకు ఓపీవీ బూస్టర్, తట్టు రుబెల్లా నివారణకు ఎంఆర్‌–2, మెదడువాపు వ్యాధికి జేఈ–2, అంధత్వ నివారణకు 
విటమిన్‌–ఎ2 

5–6 సంవత్సరాలు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు డీపీటీ–2 

10 సంవత్సరాలు: ధనుర్వాతం, కంఠ సర్పి నివారణకు టీడీ–1 బూస్టర్‌ 

16 ఏళ్ల వయసు: ధనుర్వాతం, కంఠ సర్పి నివారణకు టీడీ–2 బూస్టర్‌ 

ప్రతి బుధవారం, శనివారాల్లో వ్యాక్సిన్‌ 
పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల వయసు వరకు పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు 12 రకాల వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. ప్రతి బుధవారం, శనివారాల్లో ఆస్పత్రులు, పంచాయతీ కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాల వద్ద సిబ్బంది అందుబాటులో ఉంటూ టీకాలు వేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు అశ్రద్ధ చేయకుండా క్రమం తప్పకుండా టీకాలు వేయించుకుని వ్యాధుల నుంచి రక్షణ పొందాలని డాక్టర్‌ బి.లూసీ సూచించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)