Breaking News

బడుగు పరిశ్రమలపై కూటమి పిడుగు

Published on Mon, 02/24/2025 - 05:48

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అదనంగా మరో 10 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించడంపై దళిత పారిశ్రామికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ‘వైఎస్సార్‌ బడుగు వికాసం’ పేరిట ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 45 శాతం పెట్టుబడి రాయితీ ఇవ్వగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని 35 శాతానికి పరిమితం చేస్తూ నూతన పారిశ్రామిక విధానం 4.0ను తీసుకొచి్చందని దళిత పారిశ్రామిక సంఘాలు విమర్శించాయి. 

ఇదే విషయంపై సాక్షి ‘పారిశ్రామిక పాలసీల్లో బడుగులకు మొండిచెయ్యి’ శీర్షికన కథనం ప్రచురించింది. ఆ తర్వాత దళిత పారిశ్రామిక సంఘాలు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఎదుట పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయగా.. జరిగిన తప్పును త్వరలోనే సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. నవంబర్‌లో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో శాసనమండలిలో ఎస్సీ, ఎస్టీ రాయితీలపై వైఎస్సార్‌సీపీ ప్రతినిధులతో పాటు చైర్మన్‌ కూడా ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని పట్టుబట్టడంతో గతిలేని పరిస్థితుల్లో ఇప్పుడు తిరిగి పెట్టుబడి రాయితీని 45 శాతానికి పునరుద్ధరించారు. 

వాస్తవం ఇలా ఉంటే.. కూటమి నాయకులు ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటనలు జారీ చేయడం, దీనిని బాకా పత్రికలు పతాక స్థాయిల్లో అదనంగా 10 శాతం ప్రయోజనం అని ప్రచురించడాన్ని దళిత పారిశ్రామిక వేత్తలు తప్పుపడుతున్నారు. కేవలం ఉన్న దాన్ని పునరుద్ధరించి.. అదనంగా ఒక్క శాతం కూడా పెంచకుండా పెంచేసినట్టు ఎలా ప్రచారం చేసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)