Breaking News

సాధికారతతో పెరిగిన మహిళా ఓటింగ్‌

Published on Fri, 05/31/2024 - 05:32

సాక్షి, అమరావతి: 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహిళా సాధికారతకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు వారి కాళ్లపై వారు నిలబడటమే కాకుండా, కుటుంబానికి కూడా ఆర్థికంగా తోడ్పాటునందించడానికి పలు పథకాలు ప్రవేశపెట్టారు. చిన్న వ్యాపారాల నుంచి పరిశ్రమల ఏర్పాటు వరకు వారికి అండదండగా నిలిచారు. దీంతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొన్నారు. 

కుటుంబంలో వారి ప్రాబల్యం పెరిగి, కుటుంబ పొదుపు పెరిగింది. రాష్ట్రంలో మహిళలు సాధించిన ఈ సాధికారత పెరిగిన డిపాజిట్ల ఖాతాల రూపంలో, ఈ ఎన్నికల్లో మహిళల ఓట్ల రూపంలో ప్రతిబింబించిందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక చెబుతోంది. 2019 మార్చి నుంచి 2023 మార్చి వరకు రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా మహిళల డిపాజిట్ల ఖాతాల్లో పెరుగుదల, రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన 6 దశల లోక్‌సభ ఎన్నికల్లో పెరిగిన మహిళల ఓట్లను ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక విశ్లేషించింది.

ఆంధ్రప్రదేశ్‌లో 2019 మార్చి నుంచి 2023 మార్చికి మహిళా డిపాజిట్‌ ఖాతాలు 90.4 లక్షలు పెరిగాయని తెలిపింది. తద్వారా మహిళలు నిర్ణయాత్మకంగా మారారని, దాని ఫలితంగానే 2019 ఎన్నికలను మించి 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అదనంగా 8.4 లక్షల మంది మహిళలు ఓటు వేశారని నివేదిక వెల్లడించింది. ఈ సంవత్సరం ఎన్నికల్లో  పురుషులకన్నా మహిళా ఓటర్లు పోలింగ్‌లో అత్యధికంగా పాల్గొన్నారని తెలిపింది. 

రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో ఓట్ల పెరుగుదల జనరల్‌ కేటగిరీ నియోజకవర్గాలకంటే ఎక్కువగా ఉండటం స్వాగతించదగ్గ అంశమని పేర్కొంది. ఆసక్తికరంగా, ప్రతి అదనపు 100 మంది పురుష ఓటర్లకు,   ఎస్సీ నియోజకవర్గాల్లో 115 మంది,  ఎస్టీ నియోజకవర్గాల్లో 111 మంది మహిళా ఓటర్లు ఉన్నారని, సాధారణ నియోజకవర్గాల్లో  105 మంది మహిళలు ఉన్నారని నివేదిక పేర్కొంది.

6 దశల్లో 54.3 కోట్ల మంది ఓటు వేశారని..
దేశవ్యాప్తంగా జరిగిన ఆరు దశల పోలింగ్‌లోనూ మహిళల ఓట్లు గతంలోకన్నా బాగా పెరిగాయని తెలిపింది. కేరళ, మణిపూర్‌ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో 2019 ఎన్నికలకన్నా 2024 ఎన్నికల్లో మహిళా ఓట్లు 1.73 లక్షలు పెరిగినట్లు చెప్పింది. 2019 మార్చి నుంచి 2023 మార్చి నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మహిళా డిపాజిట్‌ ఖాతాల సంఖ్య 30.97 కోట్లు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లో 4.18 కోట్ల మహిళా ఖాతాలు, ఆ తరువాత ఢిల్లీలో 3.32 కోట్ల మహిళా ఖాతాలు పెరిగినట్లు తెలిపింది. 

2024లో మొత్తం 57.8 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 2019లో తొలి 6 దశల్లో 54.3 కోట్ల మంది ఓట్లు వేశారని, ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 3.45 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. పెరిగిన 3.45 కోట్ల మంది ఓటర్లలో, మహిళా ఓటర్లు 1.73 లక్షలు, పురుష ఓటర్లు 1.62 లక్షలుగా తెలిపింది. ఇలా మహిళా ఓటర్లు పురుషులకంటే నిర్ణయాత్మకంగా ఉన్నారని, ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 107 మంది మహిళా ఓటర్లు ఉన్నారని నివేదిక విశ్లేషించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)