Breaking News

'వృద్ధి'ల్లుతోంది

Published on Fri, 09/27/2024 - 05:09

సాక్షి, అమరావతి: ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలో జనాభా వృద్ధి తగ్గుతోంది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, బీహార్‌ జనాభా వృద్ధి పెరుగుతోంది. 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2024లో పలు రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదలను విశ్లేషిస్తూ ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదికను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలతో పోల్చితే 2024 అంచనాల మేరకు తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనాభా వృద్ధి క్షీణించిందని నివేదిక తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో 2011లో జనాభా వృద్ధి 15% ఉండగా 2024 అంచనాల మేరకు జనాభా వృద్ధి 12 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో 2011 లెక్కల ప్రకారం జనాభా వృద్ధి 27 శాతం ఉండగా 2024 అంచనాల మేరకు అది 29 శాతానికి పెరిగిందని వెల్లడించింది. కేరళ, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్, పంజాబ్, ఏపీ రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య తక్కువగా పెరుగుతోందని వెల్లడించింది. ఏపీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 50 లక్షలు ఉండగా ఇది మొత్తం జనాభాలో 10.1%గా ఉంది. 

2024 అంచనాల మేరకు వృద్ధుల జనాభా 70 లక్షలకు పెరిగింది. ఇది మొత్తం జనాభాలో 12.4%గా ఉంది. అంటే 2011–24 నాటికి వృద్ధుల సంఖ్య 2.3% పెరిగింది. 2011 జనాభాతో పోల్చి చూస్తే 2024 అంచనాల మేరకు కేరళలో 16.5 శాతం, తమిళనాడు 13.6 శాతం, హిమాచల్‌ ప్రదేశ్‌ 13.1 శాతం, పంజాబ్‌ 12.6 శాతం వృద్ధులు పెరిగారు. అతి తక్కువగా వృద్ధుల జనాభా 2024 అంచనా మేరకు బిహార్‌లో 7.7 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 8.1 శాతం, అసోంలో 8.2 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)