Breaking News

‘ఆసరా’తో అగ్రపథం..

Published on Thu, 03/14/2024 - 04:42

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా పొదుపు సంఘాలు ఆదాయపరంగా దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. ఏపీలోని సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం అత్యధికంగా ఉందని, 2019 నుంచి 2024 నాటికి వారి రోజువారీ ఆదాయం భారీగా పెరిగిందని నివేదిక తెలిపింది. పొదుపు సంఘాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అత్యధిక సగటు ఆదాయం కలిగిన 20 జిల్లాల్లో 15 గ్రామీణ జిల్లాలే కాగా ఇందులో తొమ్మిది జిల్లాలు ఏపీలోనే ఉండటం గమనార్హం. డిజిటల్‌ లావాదేవీల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ మహిళా పొదుపు సంఘాలు ముందు వరుసలో నిలిచాయి.

పొదుపు సంఘాల సభ్యులు సాధికారతతో లక్షాధికారులుగా అవతరిస్తున్నారని నివే­దిక విశ్లేషించింది. ఇటీవల వారి ఆదాయాలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో మహిళా పొదుపు సంఘాల సభ్యుల క్రెడిట్‌ ఆదాయాలపై ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పొదుపు మహిళలను ప్రోత్సహిస్తూ అమలు చేసిన ఆసరా, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాలు, బ్యాంకు రుణాలతో తోడ్పాటు, మల్టీ నేషనల్‌ కంపెనీలతో అనుసంధానం లాంటివి సత్ఫలితాలనిచ్చినట్లు స్పష్టమవుతోంది.

తద్వారా ఎన్‌పీఏల రేటు గణనీయంగా తగ్గిపోయి రికవరీ బాగుండటంతో పెద్ద ఎత్తున రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. సకాలంలో చెల్లింపులు కారణంగా వారి రుణ పరపతి సైతం పెరిగింది. గత సర్కారు హయాంలో ఏపీలో పొదుపు సంఘాల ఎన్‌పీఏలు ఏకంగా 18.36 శాతం ఉండగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆసరా, సున్నావడ్డీ పథకాల ద్వారా ఆదుకుని జీవం పోయడంతో ఇప్పుడు ఎన్‌పీఏలు గణనీయంగా 0.17 శాతానికి తగ్గిపోయాయి.  

♦ ఆంధ్రప్రదేశ్‌ తరువాత అత్యధిక వార్షిక ఆదాయం కలిగిన మహిళా పొదుపు సంఘాల సభ్యుల్లో తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్, కేరళ, పంజాబ్, గుజరాత్‌ రాష్ట్రాలున్నాయి. మ­రో ఏడాదిలోగా హర్యానా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, జార్ఖండ్‌  పొదుపు సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటనుంది.  

♦ వచ్చే రెండేళ్లలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ మహిళా పొదుపు సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటనుంది.  

♦ 2027 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేం‘ద్ర పాలిత ప్రాంతాల్లోని మహిళా పొదుపు సంఘాల సభ్యులు లక్షాధికారులై గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తారు. మహిళా పొదుపు సంఘాల సభ్యులు లక్షాధికారులుగా అవతరించడమే కాకుండా వారి కార్యకలాపాలను విస్తృతం చేస్తూ సంపదను సృష్టించి పునఃపంపిణీ చేస్తున్నారు.  

♦  గ్రామీణ ప్రాంతాల్లోని 72.7 శాతం మహిళా పొదుపు సంఘాల లావాదేవీలు ఇప్పుడు మెట్రో ప్రాంతాలకు, బయట జిల్లాలకు విస్తరించాయి. 20 కి.మీ. నుంచి 2,000 కి.మీ. పరిధిలో రాష్ట్రం లోపల, బయట కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా 65 శాతం మంది ఆదాయపరంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 30.5 శాతం గ్రామీణ ఏటీఎం లావాదేవీలు పట్టణాలు, మెట్రో ప్రాంతాలు, ఆయా జిల్లాల వెలుపల జరుగుతున్నాయి. 

♦  పొదుపు సంఘాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సభ్యులు వారి సొంత జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లి వ్యయం చేయడం పెరిగిన వారి కొనుగోలు శక్తిని సూచిస్తోంది.  

♦ విజయనగరం జిల్లాకు చెందిన పొదుపు సంఘాల సభ్యులు 68 కి.మీ. ప్రయాణించి విశాఖలో వ్యయం చేయగా శ్రీకాకుళం జిల్లా సంఘాల సభ్యులు 1,115 కి.మీ. ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ జిల్లాలో వ్యయం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళా సభ్యులు 1,647 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లాలో వ్యయం చేశారు. అన్న­మయ్య జిల్లాకు చెందిన మహిళా సభ్యులు 2,074 కి.మీ.ప్రయాణించి ఢిల్లీలో వ్యయం చేశారని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. వ్యాపారాల నిమిత్తం వారు వివిధ ప్రాంతాలకు వెళ్లి లావాదేవీలు నిర్వహించి ఉంటారని పేర్కొంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)