Breaking News

మనసే కోవెలగా..

Published on Tue, 01/14/2025 - 05:23

అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లాలోని గ్రామాల్లో ఆధ్యాత్మిక సందడి వెల్లివిరుస్తోంది. భక్తి పారవశ్యం మానసిక ప్రశాంతత చేకూరుస్తోంది. సనాతన సంప్రదాయాలకు మళ్లీ పెద్దపీట వేస్తూ దేవుని పూజలతో తన్మయత్వం పొందుతున్నారు భక్తులు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ధనుర్మాసం పూజల్లో నిమగ్నం అవుతున్నారు. పెద్ద పండుగ ముందు పల్లెలన్నీ హరినామ సంకీర్తనతో మార్మోగిపోతున్నాయి. సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మేలుకొలుపు కార్యక్రమాలు అన్ని గ్రామాలకు విస్తరిస్తున్నాయి. చలికాలం వచ్చిందంటే కాసింత వెచ్చని ఎండ వచ్చే వరకూ నిద్ర లేవని వారు సైతం హరినామ సంకీర్తనలో మమేకం అవుతున్నారు. అచ్యుతాపురం మండలంలోని జగ్గన్నపేటలో ఐదేళ్ల క్రిందట ప్రారంభమైన మేలుకొలుపులు ఇప్పుడు మండలంలోని 12 గ్రామాలకు పైగా విస్తరించింది.

తిమ్మరాజుపేట, హరిపాలెం, జగన్నాథపురం, కొండకర్ల, ఎర్రవరం, ఉప్పవరం, చీమలాపల్లి, దుప్పుతూరు, దోసూరు, గండివానిపాలెం, నరేంద్రంపురం గ్రామాల్లో మేలుకొలుపులు నెలగంట కొట్టిన రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్తరాయనంలో 6 నెలల పాటు దేవతలు సంచరించే సమయంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు దేవుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. మేలుకొలుపు కార్య­క్రమం వల్ల తెల్లవారుజాము నుంచే భక్తులు లేచి పుణ్య స్నానాలు ఆచరించి హరినామ సంకీర్తన చేస్తున్నారు. అయ్యప్ప మాలధారులు స్వామి సన్నిధికి వెళ్లిన తర్వాత మళ్లీ భక్తితత్వంలో కొనసాగేందుకు మేలుకొలుపులు ఉపయోగపడుతున్నాయని సమరసత సేవా ఫౌండేషన్‌ యలమంచిలి డివిజన్‌ ధర్మ ప్రచారకులు కొల్లి అప్పారావు చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మానసిక ప్రశాంతత, ఉల్లాసం లభిస్తోందని భక్తులు పేర్కొనడం గమనార్హం.

హరిదాసుల సందడి
నెలగంట పెట్టిన రోజు నుంచి గ్రామాల్లో హరిదాసుల సందడి మొదలయ్యింది. అక్షయ పాత్రను తలపై పెట్టుకొని హరినామస్మరణతో వీధుల్లో సంచరిస్తూ ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్నారు. గంగిరెద్దుల సందడి, గాలిపటాలతో చిన్నారుల కోలాహలం, ముగ్గుల పోటీల్లో మహిళల కళా కౌశలం ఊరూరా ప్రతిఫలిస్తోంది. సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏకాదశి రోజున నగర సంకీర్తన, వారం వారం భజనలు, పౌర్ణమి రోజున సామూహిక హారతి, సత్సంగం, కార్తీక పౌర్ణమి రోజున వెన్నెలలో పాలను మరిగించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో మహిళలు కీర్తనలు, కోలాటాలు నేర్చుకొని దేవాలయాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇది కూడా వారిలో భక్తి భావం పెంపొందించడంతోపాటు, శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడుతోంది.  

ఈ చిత్రంలో కూరగాయల వ్యాపారం చేస్తున్న వ్యక్తి పేరు చిలకా నారాయణ. 30 ఏళ్లుగా ఊనగట్ల వారపు సంతలో కూరగాయలు విక్రయిస్తున్నాడు. గత ఏడాది ఇదే సమయానికి రూ.40 వేల వరకూ వ్యాపారం చేశాడు. ప్రస్తుతం కొనేవారు లేకపోవడంతో రూ.10 వేలు కూడా దాటని దుస్థితి నెలకొందని వాపోతున్నాడు. ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన చెందుతున్నాడు.

నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం ఊనగట్లలోని వారపు సంత. మూడు గ్రామాల పరిధిలోని సుమారు 10 వేల మంది ప్రజలకు ఈ సంతే ప్రధానం. ప్రతి ఆదివారం నిర్వహించే ఈ సంతకు వచ్చి ఆయా గ్రామాల ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేస్తారు. గత ఏడాది ఇదే సమయానికి ఈ సంత కొనుగోలుదారులతో కిటకిటలాడేది. ప్రస్తుతం జనం లేక వెలవెలబోతోంది.


అతని పేరు రవి. విజయనగరం పట్టణంలోని వీటీ అగ్రహరంలో ఉంటున్నాడు. కూటమి ప్రభు­త్వం ఉచితంగా గ్యాస్‌ ఇస్తుందంటే కుటుంబ ఆర్థిక భారం తగ్గుతుందని సంబరపడ్డాడు. పథకం అమలు తరువాత రెండుసార్లు గ్యాస్‌ సిలిండర్‌ విడిపించారు. ఒక్క దానికి కూడా నగదు జమ కాలేదు. మొదటి సిలిండర్‌కు నగదు జమ కాలేదని విజయనగరం జిల్లా పౌర సరఫరాల శాఖ, గ్యాస్‌ ఏజెన్సీ, బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఈకైవేసీ చేయించమంటే చేయించారు. అయినా నగదు జమ కాలేదు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)