Breaking News

ధైర్యంగా రైలుకు ఎదురెళ్లాడు.. ‘సంఘమిత్ర’కు ప్రమాదాన్ని తప్పించాడు

Published on Fri, 06/23/2023 - 02:35

చీరాల:  ఓవ్యక్తి అప్రమత్తతతో వ్యవహరించడంతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం రైల్వేస్టేషన్‌ సమీపంలో గురువారం ఉదయం 7:15నిమిషాల సమయంలో బహిర్భూమికి వెళుతూ పట్టాలు దాటుతున్న స్థానికుడు గద్దె హేమసుందరబాబు  రైలు పట్టా విరగడాన్ని గమనించాడు. అదే సమయంలో చెన్నై వెళుతున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ వేగంగా వస్తోంది. వెంటనే రైలుకు ఎదురెళ్లి లోకో పైలెట్‌కు రైలు పట్టాలు చూపిస్తూ సైగలు చేస్తూ సంకేతాలు పంపించాడు.

అప్రమత్తమైన లోకోపైలెట్‌ రైలు వేగం తగ్గించి రైలును నిలిపివేశాడు. అనంతరం రైలు పట్టా విరిగి ఉందని చెప్పి ఘటనా స్థలానికి తీసుకెళ్లి చూపించాడు. దీంతో విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేశారు. చీరాల, బాపట్ల నుంచి వచ్చిన రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులు విరిగిన పట్టాకు మరమ్మతులు చేశారు. దీంతో 40 నిమిషాలు ఆలస్యంగా సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు బయలుదేరింది. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

కాగా పెను ప్రమాదం నుంచి తప్పించిన హేమసుందరబాబును రైల్వే అధికారులతో సహా ప్రయాణికులు ప్రశంసించారు. ఘోర ప్రమాదాన్ని నివారించిన గద్దె హేమసుందరబాబు సాహసాన్ని అభినందిస్తూ ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆయనను ఘనంగా సత్కరించారు. బాపట్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)