Breaking News

ఇసుక ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

Published on Sat, 10/19/2024 - 05:15

జంగారెడ్డిగూడెం:  ఇసుక ఉచితమంటూ ప్రచారం చేస్తున్నారని.. తీసుకెళుతుంటే మాత్రం అధికారులు కేసులు నమోదు చేస్తున్నారంటూ శుక్రవారం ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఒంటిపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం జల్లేరు వాగు నుంచి ఇసుకను రవాణా చేసేందుకు 8 ట్రాక్టర్లు వెళ్లాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్‌ అధికారులు జల్లేరు వాగు సమీపానికి వెళ్లి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. 

అనంతరం వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్‌ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దుర్గారావు అనే ట్రాక్టర్‌ యజమాని ఒంటిపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన చుట్టుపక్కల వారు దుర్గారావును నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఎస్‌ఐ ఎస్‌కే జబీర్, సీఐ వి.కృష్ణబాబులు బైపాస్‌ రోడ్డుకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. 

వారికి సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఇసుకను ఉచితంగా ఇస్తామని చెబితే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లకు ఓట్లేసి ఇప్పుడు నట్టేట మునిగామని ఆందోళన వ్యక్తం చేశారు.  ఎన్నికల్లో ఇసుకను ఫ్రీగా ఇస్తామని చెప్పిన కూటమి పెద్దలు.. ప్రభుత్వం వచ్చాక ఆ హామీని విస్మరించారని, ఉపాధి లేక తమ పరిస్థితి దయనీయంగా మారిందని ట్రాక్టర్‌ డ్రైవర్‌ వెంకటే‹Ù, ట్రాక్టర్‌ యజమాని దుర్గారావు చెప్పారు.  

నమ్మి ఓట్లు వేశాం  
ఇసుక ఉచితంగా ఇస్తే గ్రామాల్లో ఉపాధి పెరుగుతుందని నమ్మి కూటమి పార్టీలకు ఓట్లేశాం. పవన్‌కళ్యాణ్, చంద్రబాబు చెబుతున్న మాటలకు, ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ట్రాక్టర్లు కొనుకున్న ఉపాధి పొందుతున్న యువతను సైతం నిర్వీర్యం చేసేలా కూటమి చర్యలున్నాయి. ఇకనైనా మేలుకోకుంటే కూటమి ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.  –కుక్కల సత్యనారాయణ, వేగవరం, జనసేన ఎంపీటీసీ  

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)