ఇకపై ఉత్పత్తి లక్ష్యాల ప్రకారమే జీతాలు

Published on Sun, 11/16/2025 - 03:29

సాక్షి, విశాఖపట్నం: ఉద్యోగులు కార్మికుల మెడపై ఎప్పటికప్పుడు కత్తి పెట్టి ప్రైవేటీకరణ దిశగా ప్లాంట్‌ నడుపుతున్న విశాఖ ఉక్కు యాజమాన్యం మరో వింత షరతు విధించింది. ఇప్పటికే పూర్తిస్థాయి జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న యాజమాన్యం తాజాగా మరో సర్క్యులర్‌ విడుదల చేసి వారి జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఉత్పత్తి లక్ష్యాల శాతాలకు అనుగుణంగా ఇకపై జీతాల పంపిణీ ఉంటుందని, విభాగాల వారీగా ఇచ్చిన టార్గెట్లకి అనుగుణంగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

రోజు వారీ లక్ష్యాలు ఎంతమేర అందుకోనున్నారనేదానిపై గణించిన అనంతరం జీతం ఎంత ఇవ్వాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్‌లో ఉత్పత్తి లక్ష్యాల్ని చేరుకోకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉక్కు యాజమాన్యం స్పష్టం చేసింది. దీనిపై ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో ఎన్నడూ సాధించలేని లక్ష్యాలను ముందుంచి.. దానికనుగుణంగా జీతాలిస్తామని చెప్పడం గర్హనీయమంటూ ఉద్యోగ సంఘాల నాయకుడు అయోధ్యరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.   

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)