Breaking News

‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రజల నినాదమే

Published on Wed, 04/05/2023 - 04:37

సాక్షి, అమరావతి: అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్య­ద­ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ అంచనాలకు మించి రెండింతలు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని ప్రజలు చెబుతు­న్నారన్నారు. సీఎం జగన్‌ను తామంతా విశ్వసిస్తున్నామని, తమ భవిష్యత్తు ఆయనలో కనిపిస్తోందని ప్రజలు బలంగా చెబుతున్నారన్నారు.

‘జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్‌’ నినాదం ప్రజల ఆకాంక్షల నుంచి వచ్చిందని చెప్పారు. ఈ కార్య­క్ర­మం ద్వారా ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం లభిస్తుందన్నా­రు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  మంత్రు­లు మేరుగు నాగార్జున, చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం,ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలసి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పోస్టర్‌ను సజ్జల  ఆవిష్కరించారు. ఈనెల 7 నుంచి 20 వరకు  రాష్ట్రవ్యాప్తం­­గా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహి­స్తామ­న్నారు. సజ్జల ఏమన్నారంటే..

ప్రజల ఆకాంక్షల మేరకు..
ప్రజలతో మమేకమయ్యేందుకు భారీ స్థాయిలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పార్టీ పరంగా పనిచేసే వారు కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి నెరవేర్చేలా ముందుకెళ్తాం. ప్రభుత్వం పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి అంచ­నాలకు అనుగుణంగా నడుచుకునేలా భారీ కసరత్తు ప్రారంభించాం. ఈ కార్య­క్రమం ఎలా ఉండాలి? పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చాం.

14 రోజులపాటు కార్యక్రమం..
ఈ నెల 7 నుంచి 20 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరుగుతుంది. 7 లక్షల మంది సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులతో కూడిన క్షేత్ర స్థాయి సైన్యం ఈ కార్యక్రమంలో పదాతిదళంగా వ్యవహరిస్తుంది. వలంటీర్లు స్థానికంగా ఎంత ప్రాంతాన్ని కవర్‌ చేస్తారో అంతే పరిధిలో గృహ సారథుల వ్య­వస్థ కూడా పనిచేస్తుంది. సచివాలయాల కన్వీనర్లతోపాటు మండల ఇన్‌చార్జ్‌లు, వారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసే జోనల్‌ కో–ఆర్డినేటర్‌ వ్యవస్థలు ‘జగనన్నే మా భవిష్యత్తు’లో పూర్తిస్థాయిలో భాగస్వా­ములు అవుతారు.

ఈ యంత్రాంగం మొత్తం శాసనసభ్యులు, నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వ­ర్యంలో నడుస్తుంది. 14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం ద్వా­రా దాదాపు 1.60 కోట్ల కుటుంబాలను కలుసుకుంటారు. గత సర్కార్‌కు, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు. రాష్ట్రంలో సగటున 87% కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా మేలు జరుగుతోంది. అర్హులైన కుటుంబాలను నూరుశాతం సంక్షేమ పథకాల పరిధిలోకి తెచ్చిన నేపథ్యంలో సర్వే ద్వారా వారి అభిప్రాయాల్ని సేకరిస్తాం. వికృత చేష్ట­లతో సంక్షేమ రథానికి అడ్డుపడుతున్న దుష్టశక్తులకు గుణపాఠం చెబు­తాం.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)