Breaking News

అంగన్వాడీలు మెట్టు దిగడం లేదు: సజ్జల

Published on Fri, 01/12/2024 - 21:31

సాక్షి, విజయవాడ: ప్రభుత్వం మూడు దఫాలుగా అంగన్‌వాడీలతో చర్చించిందని.. సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ఉంది కాబట్టే చర్చలు జరిపామని  ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మూడో దఫాలో మంత్రి వర్గంతో అంగన్వాడీ కార్మికులు, సంఘాలు చర్చలు జరిపాయి. చర్చల అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. 

‘‘వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తామని చెప్పాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే జీతాలు పెంచాం. వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని చెప్పాం. అంగన్‌వాడీల టీఏ, డీఏలు కూడా ఫిక్స్‌ చేస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగా వ్యవహరించాం. వారి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది’’ అని సజ్జల అన్నారు.

సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల పట్ల ఎప్పుడూ పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని, గర్భిణీలు, పసిబిడ్డలకు ఇబ్బంది కలగకూడదనే ఎస్మాన పరిధిలోకి తెచ్చామని సజ్జల స్పష్టం చేశారు. ఈ సమ్మె కాలంలో.. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశాం. అంగన్‌వాడీలు విధుల్లో చేరాలని ప్రభుత్వం తరఫున కోరారాయన.

ఈ సమ్మె వెనుక పొలిటికల్‌ ఎజెండా ఉంది. ఈ పోలిటికల్‌ ఎజెండాతో అంగన్వాడీలు నష్టపోతారు. వారు విధుల్లో చేరకుంటే నిబంధనలు ప్రకారం కొత్తవారిని రిక్రూట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది అని సజ్జల పేర్కొన్నారు.


 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)