‘ఆన్‌లైన్‌’లో గ్రామాలు గ్రేట్‌!

Published on Sun, 08/17/2025 - 05:55

సాక్షి, అమరావతి: ఇప్పుడంతా ఆన్‌లైన్‌ ఆర్డర్‌ల యుగం..! దుస్తుల నుంచి సెల్‌ఫోన్ల వరకు.. పుస్తకాల నుంచి వంటింట్లో వస్తువుల దాక.. అన్నిటికీ ఆన్‌లైన్‌. అయితే, ఇందులో పల్లెలు, పట్టణాలకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అటు దేశవ్యాప్తంగానూ... ఇటు మన రాష్ట్రంలోనూ... పట్టణవాసుల కంటే గ్రామీణ ప్రజలు ఆహారేతర వస్తువులను ఆన్‌లైన్‌లో అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇంటికి చేర్చే (హోం డెలివరీ) సేవలు అందుబాటులో ఉండడంతో పట్టణ ప్రజలు ఆహార వస్తువులను ఎక్కువగా ఆర్డర్‌ పెడుతున్నారు. జాతీయ స్థాయితో పాటు వివిధ రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై సమగ్ర మాడ్యులర్‌ సర్వే: టెలికాం–2025 ఈ వివరాలు వెల్లడించింది. 
దీనిప్రకారం..

⇒ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర వస్తువులను ఆన్‌లైన్‌లో కొంటున్న కుటుంబాలు: 75.7 శాతం. ఏపీలో 75.2 శాతం. 
⇒ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆహార వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెడుతున్న కుటుంబాలు 4.3 శాతం. ఏపీలో 3.2 శాతం. 
⇒ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం కుటుంబాలు ఆహార, ఆహారేతర వస్తువులనూ ఆన్‌లైన్‌లో కొంటున్నాయి. ఏపీలో వీరి శాతం 21.6. 
⇒ దేశంలో పట్టణాల్లో 10 శాతం కుటుంబాలు ఆహార వస్తువులను ఆన్‌లైన్‌లో ఖరీదు చేస్తుండగా.. ఏపీలో 18.7 శాతం కుటుంబాలు ఇదే పద్ధతిని ఎంచుకుంటున్నాయి. 

⇒ దేశంలో పట్టణాల్లో 37.6 శాతం కుటుంబాలు ఆహారేతర వస్తువుల కోసం ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ శాతం 36.1. 
⇒ దేశంలో పట్టణాల్లో 52.4 శాతం కుటుంబాలు ఆహారం, ఆహారేతర వస్తువులను ఆన్‌లైన్‌లో కొంటుండగా, రాష్ట్రంలో ఈ శాతం 45.3. 
⇒ దేశంలో మొత్తం గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కలిపి 7.6 శాతం కుటుంబాలు  ఆహార వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తుండగా, 53.3 శాతం కుటుంబాలు ఆహారేతర వస్తువులను మాత్రమే ఆన్‌లైన్‌లో ఖరీదు చేస్తున్నాయి. 

⇒ దేశంలో 39 శాతం కుటుంబాలు ఆహారంతో పాటు ఆహారేతర వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తున్నాయి.  
⇒ ఏపీలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 11.7 శాతం కుటుంబాలు ఆహార వస్తువులను ఆన్‌లైన్‌లో కొంటుండగా... 53.7 శాతం కుటుంబాలు ఆహారేతర వస్తువులను మాత్రమే ఆర్డర్‌ పెడుతున్నాయి. 34.6 శాతం కుటుంబాలు ఆహారంతో పాటు ఆహారేతర వస్తువులను కూడా ఆన్‌లైన్‌ ద్వారానే తీసుకుంటున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)