Breaking News

మిస్‌ ఇండియా పోటీలకు గ్రామీణ రైతుబిడ్డ గోమతిరెడ్డి

Published on Tue, 02/21/2023 - 02:03

ఓబులవారిపల్లె: గ్రామీణ రైతుబిడ్డ జాతీయ స్థాయి అందాల పోటీలకు ఎంపికైంది. తన అందం, ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మిస్‌ ఆంధ్రాగా నిలిచింది. మరో రెండు వారాల్లో ముంబైలో నిర్వహించనున్న మిస్‌ ఇండియా పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లె గ్రామానికి చెందిన ముక్కా శ్రీనివాసులరెడ్డి, అరుణకుమారి దంపతుల ఏకైక కుమార్తె ముక్కా గోమతిరెడ్డి మార్చి 5వ తేదీన ముంబైలో నిర్వహించనున్న ఫెమీనా మిస్‌ ఇండియా పోటీలకు ఎంపికైంది.



గోమతిరెడ్డి చిన్ననాటి నుంచి పాఠశాలల్లో బెస్ట్‌ బేబి తదితర పోటీల్లో రాణిస్తూ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను అందాల పోటీల్లో పాల్గొనేందుకు అన్ని విధాల సహకారం అందించారు. ఈ క్రమంలో డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అందాల పోటీల్లో గెలుపొందింది. అనంతరం బెంగళూరులో నిర్వహించిన సౌత్‌ ఇండియా మిస్‌ ఫెమీనా పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. అక్కడితో అగిపోకుండా మోడలింగ్‌ రంగంలోకి కూడా ప్రవేశించింది.


ఈ ఏడాది జనవరి, 25వ తేదీన ముంబైలో నిర్వహించిన ఫెమీనా మిస్‌ అంధ్రా పోటీల్లో పాల్గొని టైటిల్‌ కైవసం చేసుకుంది. దీంతో మిస్‌ ఇండియా పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపికైంది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్న గోమతిరెడ్డి... మిస్‌ వరల్డ్‌ సాధించడమే తన లక్ష్యమని తె­లిపింది. తల్లిదండ్రుల సహకారంతో ఏదైనా సాధించవచ్చనే లక్ష్యంతో ముందుకువెళుతున్నానని, తన గ్రామానికి, దేశానికి మంచి పే­రు తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పింది.

  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)