Breaking News

డిజిటల్‌ అరెస్టు పేరిట రూ.23 లక్షల దోపిడీ

Published on Sat, 11/22/2025 - 05:14

నెల్లూరు (క్రైమ్‌): సీబీఐ అధికారుల పేరిట ఓ వ్యక్తిని డిజిటల్‌ అరెస్టు అంటూ భయభ్రాంతులకు గురిచేసిన సైబర్‌ నేరగాళ్లు అతని నుంచి రూ.23 లక్షలు కొల్లగొట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు రూరల్‌ మండలంలో వ్యవసాయ పరిశో«ధన శాస్త్రవేత్త ఉంటున్నారు. ఆయనకు ఈ నెల 17న బెంగళూరు అశోక్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ సీఐని అంటూ ఓ వ్యక్తి ఫోన్‌చేసి మహిళలకు అసభ్యకర ఫొటోలు పంపుతున్నట్లు కేసు నమోదైందని చెప్పాడు. సీబీఐ అధికారులతో మాట్లాడుతున్నట్లు వీడియో కాల్‌లో చూపించి ఆధార్‌ నంబర్‌ ఆధారంగా అరెస్టు వారెంట్‌ జారీ అయిందని భయపెట్టాడు.

18న సీబీఐ అ«ధికారి దయానాయక్‌ అనే వ్యక్తి ఫోన్‌చేసి మాట్లాడాడు. సబాత్‌ఖాన్‌ అనే నేరస్తుడు ఇచ్చిన వాంగ్మూలంలో మీ పేరు ఉందని, సుప్రీంకోర్టులో కేసు ఉందని భయపెట్టారు. నిర్దోషి అని నిరూపించుకోవాలంటే తక్షణమే సుప్రీంకోర్టు రిజర్వ్‌ ఫండ్‌కు రూ.30 లక్షలు డిపాజిట్‌ చేయాలంటూ శాస్త్రవేత్తను ఒత్తిడికి గురిచేశారు. రెండ్రోజుల పాటు డిజిటల్‌ అరెస్టుచేసి అతని నుంచి రూ.23,00,117 నగదును సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. మోసపోయానని గ్ర­హించిన బాధితుడు 1930కు ఫిర్యాదు చేశారు. అలాగే, వేదాయపాళెం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)