Breaking News

డిసెంబర్‌లో రెండు ప్రయోగాలు

Published on Wed, 11/12/2025 - 05:26

సూళ్లూరుపేట: ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు రాకెట్‌ ప్రయోగాలే చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్‌ నెలలో రెండు ప్రయోగాలకు సిద్ధమవుతోంది. రెండోవారంలో ఎల్‌వీఎం3 మార్క్‌–6 రాకెట్‌ ద్వారా బ్లాక్‌–2 బ్లూబర్డ్‌ ఉపగ్రహాన్ని, చివరివారంలో పీఎస్‌ఎల్‌వీ సీ62 రాకెట్‌ ద్వారా ఓషన్‌శాట్‌–3ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. షార్‌లోని రెండో ప్రయోగవేదికకు అనుసంధానంగా ఉన్న రెండో వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన ఎల్‌వీఎం3 మార్క్‌–6 రాకెట్‌ అనుసంధానం పనులు చురుగ్గా సాగుతున్నాయి. 

ఈ ప్రయోగం ద్వారా అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న ఏఎస్‌టీ స్పేస్‌ మొబైల్‌ రూపొందించిన 6,500 కిలోల బరువు కలిగిన బ్లాక్‌–2 బ్లూబర్డ్‌ ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహానికి సంబంధించి అమెరికన్‌ శాస్త్రవేత్తలు షార్‌లో రాకెట్‌ అనుసంధానం పనుల్లో పాలుపంచుకుంటున్నారు. ఇస్రో చరిత్రలో 6,500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.  

సాంకేతిక విప్లవం... బ్లాక్‌–2 బ్లూబర్డ్‌  
టెక్సాస్‌లోని ఏఎస్‌టీ స్పేస్‌ మొబైల్‌ సంస్థ రూపొందించిన బ్లూబర్డ్‌ ఉ­ప­గ్రహం విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఇద్దరు వ్య­క్తులు అంతరిక్షం నుంచి స్మార్ట్‌ ఫోన్లు ఉపయోగించి కాల్స్‌ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించారు. భూమికి తక్కువ దూ­రంలోని లియో ఆర్బిట్‌ నుంచి పనిచేసే ఈ ఉ­పగ్రహానికి 64 చదరపు మీటర్ల వినూత్నమైన యాంటెన్నా ఉంది. ఇది ఉపగ్రహం నుంచి స్మార్ట్‌ ఫోన్‌కు ప్రత్యక్ష కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. 

మొబైల్‌ఫోన్‌ వినియోగదారులు భూమిపై ఉండే టవర్ల మీద ఆధారపడకుండా అంతరిక్షం నుంచి కాల్స్‌ చేయడానికి, బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ను యాక్సెస్‌ చేయడానికి ఈ ఉపగ్రహం దోహదపడుతుంది. బ్లూబర్డ్‌ ఉపగ్రహం కిరణాలు 40 ఎంహెచ్‌జడ్‌ వరకు సామర్థ్యాన్ని కలిగి ఉండేలా రూపొందించారు. 

ఇది 120 ఎంబీపీఎస్‌ వరకు గరిష్ట ట్రాన్స్‌మిషన్‌ వేగాన్ని అందిస్తుంది. బ్లూబర్డ్‌ ఉపగ్రహాల సిరీస్‌ యూఎస్‌ఏలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంపికచేసిన మార్కెట్లలో నిరంతరాయంగా సెల్యులార్‌ బ్రాండ్‌బ్యాండ్‌ సేవలు అందించాలన్నదే లక్ష్యంగా దీన్ని ప్రయోగిస్తున్నారు.  

1,800 కిలోల బరువున్న ఓషన్‌శాట్‌–3ఏ  
డిసెంబర్‌ ఆఖరువారంలో ప్రయోగించే పీఎస్‌ఎల్‌వీ సీ62 రాకెట్‌ అ­ను­సంధానం పనులు మొదటి ప్ర­యో­గవేదికకు అనుసంధానంగా ఉన్న పిఫ్‌ బిల్డింగ్‌లో జరుగుతున్నా­యి. ఈ రాకెట్‌ ద్వారా 1,800 కిలోల బరువున్న ఓషన్‌శాట్‌–3ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నా­రు. ఈ రాకెట్‌లను షెడ్యూల్‌ చే­సిన తేదీల్లో ప్రయోగించలేకపోవడంతో రెండు ప్రయోగాలను డిసెంబర్‌లోనే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఈ ఏడాది రాకె­ట్‌ ప్రయోగాల జోరు తగ్గింది. జనవరి తరువాత మూడునెలలు ప్రయోగాలే లేవు. మే, జూలై నెలల్లో రెండు ప్రయో­గాలు చేశా­రు. ఆ తరువాత మూడునెలలు ప్ర­యోగాలకు బ్రేక్‌పడింది. ఈ నెల 2న ఒక రాకెట్‌ ప్రయోగించిన విష­యం తెలిసిందే. అంటే ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం నాలుగు ప్రయోగాలు మాత్రమే చేశారు.  

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)