Breaking News

రూ.50 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌తో రహదారి భద్రతా నిధి 

Published on Thu, 09/28/2023 - 03:44

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో రహదారి భద్రతకు సంబంధించి రూ.50 కోట్లతో రివాల్వింగ్‌ ఫండ్‌ నిధులతో ప్రత్యేకంగా రహదారి భద్రతా నిధిని ఏ ర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రహదారి భద్రత, రహదారి భద్రత డ్రాప్ట్‌ ఆ డిట్‌ నివేదిక అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రహ దారి ప్రమాదాల వల్ల ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోడం లేదా తీ­వ్రంగా గాయపడడం వల్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నా రు.

రహదారి భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుందని తెలిపారు. కొత్తగా చేపట్టే వివిధ రహదారుల ప్రాజెక్టు అంచనాల్లో 2 శాతం నిధులు రహదారి భద్రతా నిధికి జమ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. వివిధ జాతీయ, రాష్ట్ర, ఇతర ముఖ్యమైన రహదారులపై గల జంక్షన్లను మెరుగుపర్చడంతో పాటు బ్లాక్‌ స్పాట్లను తక్షణం సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హెల్మెట్‌ ధరించడం, సీటు బెల్టు వినియోగంపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన క  ల్పించాలని సూచించారు.

మద్యం తాగి వాహనాలు నడపడం లేదా సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై నూతన మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగరాలు, పట్టణాల్లో  ప్రమా­దాల నివారణకు సిగ్నల్‌ వ్యవస్థతో పాటు సీసీ కెమెరాలను సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. వివిధ పాఠశాలలు, కళాశా లలు, ప్రార్థనా మందిరాల పరిసరాల్లోని రహదారులపై ప్రత్యేకంగా సైనేజి బోర్డుల ఏర్పాటుతో పాటు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.

రాష్ట్ర రహదారులు–భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న సమావేశపు అజెండా, రోడ్డు సేఫ్టీ ఆడిట్‌కు సంబంధించిన సిఫార్సులను వివరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌ కుమార్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)