Breaking News

ధరల మంట!

Published on Tue, 07/14/2026 - 06:13

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ధరలు అధికంగా ఉన్నాయి. మే నెలతో పోల్చితే జూన్‌లో రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణంతోపాటు ఆహార ద్రవ్యోల్బణం పెరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ(ఎంఎస్‌పీఐ) సోమవారం విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక స్పష్టం చేసింది.

ఆ సూచిక ప్రకారం జూన్‌ నెలలో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ దరల పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు, ప్రధానంగా ఆహార ధరలు పెరిగినట్లు ఎంఎస్‌పీఐ వెల్లడించింది. రాష్ట్రంలో జూన్‌ నెలలో సాధారణ ద్రవ్యోల్బణం 5.39 శాతం ఉండగా, ఆహార ద్రవ్యోల్బణం 8.18 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. మే నెలలో రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణం 4.90 శాతం ఉండగా, జూన్‌లో 5.39 శాతానికి పెరిగింది. అలాగే ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో 6.93 శాతం ఉండగా, జూన్‌లో ఏకంగా 8.18 శాతానికి చేరింది.  

గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికం.. 
⇒ జూన్‌ నెలలో రాష్ట్రంలో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 5.71 శాతం, పట్టణాల్లో 4.89 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.  
⇒ జూన్‌లో జాతీయ సగటు సాధారణ ద్రవ్యోల్బణం 4.38 శాతం ఉండగా, ఆహార ద్రవ్యోల్బణం 5.32 శాతం ఉంది.  
⇒ జాతీయ సాధారణ ద్రవ్యోల్బణం కన్నా రాష్ట్రంలోనే పట్టణాల సాధారణ ద్రవ్యోల్బణం(4.89శాతం), ఆహార ద్రవ్యోల్బణం(8.18 శాతం) అత్యధికంగా ఉంది. 

⇒  మే నెలతో పోలి్చతే జూన్‌లో వంట నూనెలతోపాటు పప్పులు, కూరగాయల ధరలు పెరిగాయి.  
⇒  ద్రవ్యోల్బణంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. తమిళనాడు, మూడో స్థానంలో, ఒడిశా నాలుగో 
స్థానం, మధ్యప్రదేశ్‌ ఐదో స్థానంలో ఉన్నాయి.  
⇒ మే నెలలో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ జూన్‌ నెలలో రెండో స్థానానికి చేరడం గమనార్హం.   

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)