Breaking News

బియ్యం వ్యాపారి ఆత్మహత్యాయత్నం

Published on Mon, 10/14/2024 - 05:32

ఏలూరు టౌన్‌: అధికారుల వేధింపులు తాళలేక ఏలూరులో ఒక బియ్యం వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విజయవాడకు తరలించారు. తాను బియ్యం వ్యాపారం చేస్తున్నానని, అక్రమాలేవీ లేకపోయినా అధికారులు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని, ఇవ్వలేనని చెప్పడంతో అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని బాధితుడు చెప్పాడు.

బాధితుడు, అతని కుమారుడి కథనం మేరకు వివరాలు.. జంధ్యావుల సుధాకర్‌ అలియాస్‌ నాని గత కొంతకాలంగా ఏలూరు పరిసర ప్రాంతాల్లో బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. ఇళ్ల వద్దకు వెళ్లి ఎవరైనా బియ్యం విక్రయిస్తే వాటిని కొనుగోలు చేసి రెండు, మూడు రూపాయలు ఎక్కువకు పెద్ద వ్యాపారులకు అమ్ముతూ ఉంటాడు. ఈ నెల 11న సుధాకర్‌ పెదవేగి మండలం పినకడిమిలో బియ్యం కొనుగోలుకు వెళ్లాడు. అదే సమయంలో పెదవేగి మండల డిప్యూటీ తహసీల్దార్‌ ప్రమోద్‌ అక్కడికి వెళ్లారు. వేరే బియ్యం బస్తాలను సుధాకర్‌కు చెందిన వ్యాన్‌లో వేయించి, బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నాడంటూ కేసు నమోదు చేస్తానని బెదిరించారు.

రూ.50 వేలు ఇస్తేనే కేసు లేకుండా చేస్తానని, లేకుంటే కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు. తాను అంత సొమ్ము ఇచ్చుకోలేనని బతిమిలాడాడు. ‘నాకు డబ్బులు ఇవ్వాల్సిందే.. లేదంటే నీ చావు నువ్వు చావు.. నాకు సంబంధం లేదు..’ అంటూ తేల్చి చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవటంతో డీటీ ప్రమోద్‌ కేసు నమోదు చేసి, పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుధాకర్‌ ఈ నెల 12న పురుగుల మందు తాగి పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.

పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ ఇస్తామని చెప్పడంతో తన కుమారుడు పృథ్వీని స్టేషన్‌ వద్దకు రమ్మని చెప్పాడు. అనంతరం తాను విషం తాగిన విషయాన్ని కుమారుడికి చెప్పడంతో వెంటనే ఏలూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. పెదవేగి మండల డిప్యూటీ తహసీల్దార్‌ ప్రమోద్‌ను దీనిపై వివరణ కోరగా.. సుధాకర్‌ నుంచి తాము డబ్బులు డిమాండ్‌ లేదని చెప్పారు. 650 కిలోల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్టు గుర్తించి సీజ్‌ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)