Breaking News

రాష్ట్రంలో విప్లవాత్మక విద్యాసంస్కరణలు 

Published on Wed, 07/12/2023 - 04:23

సాక్షి, అమరావతి: ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రంలో విప్లవాత్మక విద్యాసంస్కరణలు అమలు చేస్తోందని పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌కుమార్‌ చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 259 పాఠశాలలు సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉంటే ఇప్పుడు 1000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విద్యావిధానం అమలు చేయడం సీబీఎస్‌ఈ చరిత్రలోనే మైలురాయిగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ నిర్మాణాత్మక బోధన అంశంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌కు నాలుగు రోజుల శిక్షణ సదస్సు మంగళవారం విజయవాడలో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్కరణల్లో భాగంగా సీబీఎస్‌ఈ పాఠశాలలను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్యతో పాటు సరైన మూల్యాంకనం, విద్యార్థుల్లో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సమైక్యంగా కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 2024–25 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలు సీబీఎస్‌ఈ విధానంలో రాయనున్నారని చెప్పారు.

ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలు, విద్యావిధానాలను పాఠశాలల్లో అమలు చేసి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ స్కీమ్స్‌ అండ్‌ పాలసీస్‌ (క్రిస్‌్ప) కార్యదర్శి ఆర్‌.సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, మోడల్‌ స్కూల్‌ కార్యదర్శి ఎం.వి.కృష్ణారెడ్డి, వివిధ ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల ప్రిన్సిపల్స్, ఏపీ, తెలంగాణ ఎస్‌సీఈఆరీ్ట, ప్రథమ్, సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్, రూమ్‌ టూ రీడ్, అజీమ్‌ప్రేమ్‌జీ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)