Breaking News

పోలవరం తొలిదశ సవరించిన అంచనా వ్యయం రూ.30,437 కోట్లు

Published on Wed, 07/31/2024 - 05:57

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయం తాజా (2023, మార్చి) ధరల ప్రకారం రూ.30,436.95 కోట్లు అని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీసీ) 2023 అక్టోబర్‌ 19న తేల్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో చెప్పారు. 

గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) డ్యామ్‌ గ్యాప్‌–2లో కోతకు గురై దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌ పునరుద్ధరణ, డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురవడం వల్ల ఏర్పడిన అగాధాలను పూడ్చి యథాస్థితికి తెచ్చే పనులకు రూ.2,620.24 కోట్లు ఖర్చువుతుందని ఆర్‌సీసీ అంచనా వేసిందని మంగళవారం టీడీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. 

తాజా ధరల ప్రకారం నిధులిచ్చేలా అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేకుండా చేశారని, ఇది ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి దోహదపడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

నిధుల సంక్షోభంలోకి నెట్టిన చంద్రబాబు
విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి. కానీ.. కమీషన్ల కోసం అప్పటి సీఎం చంద్రబాబు.. 2016 సెప్టెంబరు 7న ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. 2013–14 నాటి ధరల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం 2014 ఏప్రిల్‌ 1 నాటికి ప్రాజెక్టు పనులకు చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు పోను మిగతా రూ.15,667.90 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెబితే దానికీ తలూపారు. 

నిజానికి 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ.33,168.24 కోట్లు. కానీ.. ప్రాజెక్టు మొత్తాన్ని రూ.15,667.90 కోట్లతోనే పూర్తి చేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యం కమీషన్లే. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని 2019లో సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం.

సంక్షోభం నుంచి తప్పించిన వైఎస్‌ జగన్‌
వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తూ వచ్చారు. తాజా ధరల ప్రకారం నిధులిచ్చి, ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని అనేకమార్లు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రధాని.. ప్రాజెక్టును రెండో దశల్లో పూర్తి చేద్దామని, తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్‌ వరకు, ఆ తర్వాత 45.72 మీటర్ల కాంటూర్‌ వరకు  పూర్తి చేద్దామని చెప్పారు. 

ఆ మేరకు తొలి దశ పనుల పూర్తికి (డయాఫ్రం వాల్‌ పునరుద్ధరణ, మరమ్మతులతో కలిపి) తాజా ధరల ప్రకారం రూ.31,625.37 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరించిన అంచనాలకు 2023 జూలైలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదముద్ర వేసి, ఆర్‌సీసీకి నివేదించింది. వాటిని పరిశీలించిన ఆర్‌సీసీ.. తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లుగా నిర్ధారించింది. 

నాడు మోకాలడ్డి.. నేడు వినతులు
పోలవరం తొలి దశలో ఇప్పటివరకూ అయిన పనులకు చేసిన వ్యయం, కేంద్రం రీయింబర్స్‌ చేసిన మొత్తంపోనూ మిగిలిన పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు మంజూరు చేయాలని గత మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు కేంద్ర జల్‌ శక్తి శాఖ ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్‌డీఏలో చేరిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఆ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేస్తే రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. 

దాంతో అప్పట్లో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ అజెండా నుంచి తప్పించింది. ఇలా ఆ నిధులకు మోకాలడ్డిన చంద్రబాబే.. ఈ నెల 27న ఢిల్లీలో కేంద్ర జల్‌ శక్తి శాఖ  మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి పోలవరం  తొలి దశకు ఇవ్వాల్సిన రూ.12,157.53 కోట్లు  మంజూరు చేయాలని, ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం.  

Videos

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)