Breaking News

CM Jagan: ఇది మన ప్రభుత్వం.. గుర్తుపెట్టుకోండి

Published on Mon, 03/13/2023 - 19:18

సాక్షి, గుంటూరు: ముస్లింలకు ఈ ప్రభుత్వంలో ఇచ్చిన పదవులు మరే ప్రభుత్వంలోనూ ఇవ్వలేదని.. అన్ని సమస్యలను యుద్ధ ప్రాతిపదికిన పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి .. ముస్లిం సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అంతేకాదు అవసరమైన నిధులును కూడా కేటాయిస్తామని తెలిపారాయన. సోమవారం తాడేపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం సంఘాల ప్రతినిధులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. 

‘‘ఇది మనందరి ప్రభుత్వం అనే విషయాన్ని మనసులో పెట్టుకోండి.  ప్రభుత్వం నుంచి మీకు ఏ రకంగా మరింత సహాయం చేయాలన్నదానిపై మీ సలహాలు తీసుకోవడానికే ఇవాళ మిమ్నల్ని పిలిచాం. మీరు చెప్పిన అన్ని అంశాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తాం. మీరు చెప్పిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన నిధులును కూడా కేటాయిస్తాం. అన్ని సమస్యలకు సానుకూలమైన పరిష్కారం ఈ సమావేశం ద్వారా లభిస్తుంది’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అలాగే.. దేవుడి దయతో ప్రతి ఇంటికీ, గడపకూ మంచి చేస్తున్నామని, ఈ దఫా మన లక్ష్యం 175 కి 175 స్ధానాలు గెలవడం. కచ్చితంగా దాన్ని సాధిస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంలో తమ సమస్యలను సీఎం జగన్‌కు వివరించారు వాళ్లు. వక్ఫ్‌ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధులు.. వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణ, మదరసాలలో విద్యా వాలంటీర్లకు జీతాలు చెల్లింపు, ముస్లింల అభ్యన్నతికి సలహాదారు నియామకం వంటి అంశాలను తెలియజేశారు. ఈ అంశాలన్నింటికీ సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు. 

కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్‌ హౌస్‌ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీఏం జగన్‌ అధికారులను అదేశించారు. అలాగే.. విజయవాడలోనూ హజ్‌ హౌస్‌ నిర్మాణం చేపట్టాలని ముస్లిం సంఘాలు విజ్ఞప్తి చేయగా.. అందుకు అవసరమైన భూమి కేటాయించాలని అక్కడికక్కడే అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంలో.. అన్ని మతాల భూముల ఆస్తులు పరిరక్షణకు జిల్లా స్ధాయిలో ప్రత్యేక కమిటీ నియమించాలని నిర్ణయించారాయన. జిల్లా స్ధాయిలో ఈ కమిటీల ఏర్పాటు ఉండాలని, కలెక్టర్‌ ఆధ్వర్యంలో జేసీ, ఏఎస్పీలతో ఒక కమిటీ వేసి.. ఒక సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌. 

ఖాజీల పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచేందుకు సైతం సీఎం జగన్‌ సుముఖత వ్యక్తం చేశారు. అలాగే.. మదరసాలలో పనిచేస్తున్న విద్యావాలంటీర్ల జీతాలు సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. ఉర్ధూ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నాటికి బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌లో భాగంగా.. ఇంగ్లిషుతోపాటు ఉర్ధూలో కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు ఉర్ధూ విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని తెలియజేశారు. సయ్యద్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్న ముస్లిం మతపెద్దల విజ్ఞప్తికి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)