Breaking News

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి ప్రమాదం!

Published on Fri, 06/12/2026 - 00:39

విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్-1 విభాగంలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడిల్ నుంచి ఉక్కు ద్రావణం కింద పడటంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో ప్లాంట్ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గురువారం ఉదయం ఒకసారి, అర్ధరాత్రి మరోసారి ఎస్ఎంఎస్-1లో వేర్వేరు ప్రమాదాలు సంభవించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ఈ తాజా ఘటనలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీ ప్రమాదం జరిగిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టకుండా పనులు ప్రారంభించడమే ఈ పరిస్థితికి కారణమని కార్మికులు ఆరోపించారు.

స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని.. కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో జరిగిన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా, భద్రతా చర్యలను పటిష్టం చేయకుండా ఉత్పత్తిపైనే దృష్టి పెట్టడం సరికాదని వారు విమర్శించారు. కార్మికుల ప్రాణాల కంటే ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

ఎస్ఎంఎస్-1లో పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టి, అన్ని భద్రతా ప్రమాణాలను అమలు చేసిన తర్వాతే పనులు పునఃప్రారంభించాలని కార్మికులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)