Breaking News

కార్తీక వనసమారాధనలో గలాటా

Published on Mon, 11/18/2024 - 05:30

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కార్తీక వన సమారాధనలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాకినాడలో ఆదివారం జరిగిన ఒక సామాజికవర్గ వన సమారాధనలో పాల్గొన్న ఆయన రాజకీయాలు ప్రస్తావించడం వివాదానికి ఆజ్యం పోసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తే.. కుల సంఘ నాయకులు దూరంగా ఉండాలని, ఎవరు నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవాలని చెప్పాలే తప్ప ఒక పార్టీకి కొమ్ము కాయకూడదని, ఎవరో సిద్ధం అంటే వారికి మద్దతు తెలపడం తగదని మంత్రి సుభాష్‌ అన్నారు. 

దీంతో వనసమారాధనలో గలాటా మొదలైంది. కుల సంఘ నాయకులను తప్పు పడుతూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై పలువురు నిరసన తెలిపారు. దీంతో మంత్రి నోరు జారి సంస్కార హీనులను దూరంగా ఉంచాలని, సంస్కారం లేని వెధవలను పట్టించుకోవద్దని అనడంతో ఒక్కసారిగా తోపులాట మొదలైంది. మంత్రి మాటలతో ఆగ్రహించిన కొందరు కుర్చిలు సైతం విసిరారు. అక్కడున్న వారు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం ఒకరినొకరు నెట్టుకున్నారు. బాహాబాహీకి దిగారు.

పోలీసులు రంగప్రవేశం వేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం వైఎస్సార్‌సీపీ రామచంద్రపురం కో–ఆర్డినేటర్‌ పిల్లి సూర్యప్రకాశరావు మాట్లాడుతూ తన సామాజికవర్గానికి తాను అండగా ఉంటానన్నారు. శెట్టిబలిజ సామాజికవర్గం నేడు కలుసుకుంటుందంటే దానికి కారణం దొమ్మేటి వెంకటరెడ్డి అని చెప్పారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)