Breaking News

రేపటి నుంచి ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా సీట్లకు రిజిస్ట్రేషన్లు

Published on Sun, 07/27/2025 - 05:50

సాక్షి, అమరావతి: 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్‌ యాజమాన్య కోటా సీ­ట్లలో అడ్మిషన్ల భర్తీ కోసం శనివారం డాక్టర్‌ ఎన్టీ­ఆర్‌ ఆరోగ్య విశవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్, ప్రైవేటు కళాశాలల్లో బీ, సీ కేటగిరీ సీట్లలో ప్రవేశాల కోసం విద్యార్థులు సోమవారం నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్  చేసుకోవాలని సూచించింది. 

ఆలస్య రు­సు­ముతో ఆగస్టు 4 తేదీ వరకు అవకాశం ఉందని తెలిపింది. ఆరు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బీ–కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ కోటాలో 341 సీట్లు ఉండ­గా, తిరుపతి స్విమ్స్‌లో ఎన్‌ఆర్‌ఐ కోటాలో 23 సీ­ట్లు ఉన్నట్టు వివరించింది. ప్రైవేట్‌ కాలేజీల్లో బీ–­కేటగిరీ ఎంబీబీఎస్‌ సీట్లు 1,074, సీ–కేటగిరీ (ఎన్‌­ఆర్‌ఐ) కోటాలో మరో 451 సీట్లు, బీడీఎస్‌లో బీ–కేటగిరీ సీట్లు 1,565, ఎన్‌ఆర్‌ఐ కోటాలో 209 సీట్లు ఉన్నాయని వర్సిటీ రిజి్రస్టార్‌ డాక్టర్‌ వి.
రాధికారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.   

ఆలిండియా కోటా రిజిస్ట్రేషన్  గడువు పెంపు 
ఎంబీబీఎస్‌ ఆలిండియా కోటా మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ గడువును ఈ నెల 31­వ తేదీ వరకు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) పొడిగించింది. సోమవారంతో రిజి్రస్టేషన్, చా­యి­స్‌ నమోదుకు గడువు ముగియనుండగా, 31 వ తేదీ వరకు పొడిగించారు. ఆగస్టు 3, 4 తేదీల్లో సీట్లు కేటాయిస్తారు. 8వ తేదీలోపు విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)