Breaking News

ప్రతి క్లినిక్‌కు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

Published on Thu, 08/06/2026 - 05:29

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్‌ ఆయుర్వేద, హోమియో, యునానీ, సిద్ధ, యోగా–ప్రకృతి వైద్య సేవలు అందిస్తున్న క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్‌ హోమ్‌లు, ఆస్పత్రులు, వైద్య నిర్ధారణ కేంద్రాల నిర్వహణకు వైద్య శాఖ నిబంధనలు రూపొందించింది. చిన్న క్లినిక్‌ నుంచి 200 పడకలకు పైబడిన ప్రతి ఆయుష్‌ ప్రైవేట్‌ వైద్య సంస్థకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కానుంది. సలహాలు, సూచన­లకోసం ముసా­యిదా నిబంధన­లను ఆయు­ష్‌శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ayush.ap.gov.in లో అందుబాటు­లో ఉంచామని ఆయు­ష్‌ కమి­ష­న­ర్‌ ఆర్‌.­గోపాలకృష్ణ ప్రకటించారు. commr-apayush@ap.gov.in ద్వారా ప్రజలు, ఆయుష్‌ వైద్యులు, ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్య సంఘాలు, నిపుణులు రెండు వారాల్లో అభ్యంతరాలను తెలియజేయవచ్చని సూచించారు.

ఇప్పటి వరకు అల్లోపతి ప్రైవేట్‌ వైద్య సంస్థలకు మాత్రమే వర్తిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం–2002ను ప్రభుత్వం సవరించింది. చట్టం నంబరు 18/2026 ద్వారా ఆయుష్‌ వైద్య విధా­నా­లను కూడా దీని పరిధి­లోకి తెస్తూ ఏప్రిల్‌ 10న గెజిట్‌ నోటిఫికేష్‌ విడు­దల చేసింది. సవరించిన చట్టాన్ని అమలుకు ఏపీ ఆయుష్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ రూల్స్‌–2026 పేరుతో ఆయుష్‌ విభాగం నిబంధనలు తయారు చేసింది.

ఏడు విభాగాలుగా వర్గీకరణ
సింగిల్‌ డాక్టర్‌ క్లినిక్, పాలీక్లినిక్, 20 పడకలలోపు ఆస్పత్రులు, 21 నుంచి 50 పడకలు, 51 నుంచి 100 పడకలు, 101 నుంచి 200 పడకలు, 200 పడకలకు పైబడిన ఆస్పత్రులు... ఇలా ఏడు విభాగాలుగా ఆస్పత్రులను వర్గీకరించారు. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. 

దరఖాస్తు చేసిన వెంటనే 90 రోజులపాటు చెల్లుబాట­య్యేలా తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ జారీ చేస్తారు. పది రోజుల్లోపు వైద్య నిపుణులతో కూడిన బృందం సంబంధిత వైద్య సంస్థను తనిఖీ చేస్తుంది. అన్ని ప్రమాణాలు ఉంటే ఐదేళ్ల కాలవ్యవధి­తో శాశ్వత రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ జారీ అవుతుంది. నిబంధనలను ఉల్లంఘించినా, అర్హత లేని వ్యక్తులతో వైద్యసేవలు అందించినా, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు రుజువైనా రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా/పూర్తిగా రద్దు చేస్తారు.  

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)