Breaking News

‘పాట్‌’ అమలులో ఏపీ ఉత్తమం

Published on Thu, 03/07/2024 - 02:27

సాక్షి, అమరావతి: పెర్ఫార్మ్, అచీవ్‌ ట్రేడ్‌ (పాట్‌) పథకం అమలులో రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధి­స్తోందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ చెప్పారు. పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇంధన వ్య­యాన్ని తగ్గించడం, గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను కట్టడిచేయడం వంటి లక్ష్యాలను సాధించడంలో భాగంగా పరిశ్రమల్లో ఎనర్జీ మేనేజర్లకు పాట్‌ పథకంపై బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) బుధవారం విజయవాడలో రీజనల్‌ వర్క్‌షాప్‌ నిర్వహించింది.

ఈ వర్క్‌­షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయానంద్‌ ఏపీఎస్‌ఈసీఎం సీఈవో కుమారరెడ్డి,  ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు, నెడ్‌క్యాప్‌ వీసీ, ఎండీ నందకిషోర్‌రెడ్డి, ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ సీఎండీ కమలాకర్‌బాబు, బీఈఈ సీనియర్‌ సెక్టార్‌ ఎక్స్‌పర్ట్‌ నవీన్‌కుమార్‌లతో కలిసి పాట్‌పై బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లా­డుతూ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పాట్‌ పథకం అమలు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లలో  డీకార్బనైజేషన్‌ చర్యలు నిర్వహించడం వంటి పటిష్టమైన ప్లాన్‌ను  రూపొందించిన ఉత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని చెప్పారు.

ఈ పథకం దేశవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నా­రు. పాట్‌ సైకిల్‌–1లో 8.67 మిలియన్‌ టన్‌ ఆఫ్‌ ఆ­యిల్‌ ఈక్వివాలెంట్‌ (ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆ­దా చేయడం వల్ల సుమారు 31 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలను నివారించగలిగామని చెప్పారు. పాట్‌ సైకిల్‌–2లో 14.08 ఎంటీవోఈ ఇంధనం ఆదా చేయడంద్వారా 68 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఇంధన సా­మర్థ్య చర్య­లను అమలు చేయడం ద్వారా పాట్‌ సైకిల్‌–3 వరకు 1.16 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చే­శా­య­ని చెప్పారు.

పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే కాకుండా పారిశ్రామిక ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఆయన తెలిపారు. వర్క్‌­షాప్‌లో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సిమెంట్, టెక్స్‌టైల్స్, పవర్‌ప్లాంట్లు, ఎరువు­లు, ఇనుము, ఉక్కు, ఎరువులు, సిమెంట్, అల్యూ­మినియం, పేపర్, క్లోర్‌–ఆల్కల్‌ పరిశ్రమల నుంచి 100 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)