ఆరోగ్యానికి ‘ప్లానెట్‌ ఫ్రెండ్లీ’ డైట్‌

Published on Mon, 08/07/2023 - 02:59

సాక్షి, అమరావతి: పర్యావరణ అనుకూల ఆహా­రం (ప్లానెట్‌ ఫ్రెండ్లీ డైట్‌) అనారోగ్య కారణాలతో సంభవించే మరణాల ముప్పు­ను తగ్గిస్తుందని హార్వర్డ్‌ విశ్వవిద్యా­లయం పరిశోధ­కులు కనుగొన్నారు. పర్యావరణ అనుకూల ఆహారం తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం, స్ట్రోక్, గుండె, శ్వాస వ్యాధుల నుంచి వచ్చే మర­ణాలు 25 శాతం తగ్గుతా­యని తాజా అధ్యయ­నంలో తేల్చారు. మాంసం, చేపలు, గుడ్లు, డెయిరీ ఉత్పత్తులను ఆహా­రంగా తీసుకునే వారితో పోలిస్తే పండ్లు, కూరగాయలు, తృణధా­న్యాలు, గింజలు అధికంగా పోషకాలు ఉండే మొక్కల ఆధారిత ఆహారాన్ని తినే వారిలో మరణాల అవకాశం తక్కువగా ఉందని స్పష్టం చేశారు.

దాదాపు 30 ఏళ్ల పరిశోధనలో లక్ష మందికి పైగా ఆహారపు అలవాట్లను ట్రాక్‌ చేశారు. ఈ క్రమం­లోనే అమెరికన్‌ సొసైటీ ఫర్‌ న్యూ­ట్రిషన్‌ వార్షిక సమావేశంలో న్యూట్రిషన్‌–­2023లో పర్యావరణ అనుకూల ఆహార విని­యో­గంపై ప్లానెటరీ హెల్త్‌ డైట్‌ ఇండెక్స్‌ పేరుతో కొత్త డైట్‌ స్కోర్‌ను ప్రతిపాదించారు. దీనిని నీరు, భూ విని­యోగంతో పాటు కర్బన ఉద్గారా­లను పరిమితం చేసి పర్యావరణంపై తక్కువ నష్టం చూపించే ఆహారంగా పేర్కొన్నారు.

1986లో మొదలుపెట్టి..
ఆరోగ్యం, పర్యావరణం రెండింటిపై ఆహార ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ, శాస్త్రీయ ఆధారాలతో డైట్‌ స్కోర్‌ను ప్రతిపాదించారు. 1986 నుంచి 2018 వరకు లక్ష మంది అధ్యయనంలో పాల్గొన్నారు. ఇందులో 47 వేల మంది మరణించారు. ఎక్కువ పీహెచ్‌డీఐ స్కోరు ఉన్న వారికి మరణాల అవకాశాలు తక్కు­వగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ప్రత్యేకించి శ్వాసకోశ వ్యాధులతో మరణించే అవకాశం 50 శాతం, న్యూరోడెజెనరేటివ్‌ వ్యాధులతో మరణించే అవకాశం 20 శాతం, క్యాన్సర్‌/గుండె జబ్బులతో మరణించే అవకాశాలు 15 శాతం వరకు తక్కువ ఉన్నట్టు నివేదించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆహారపు అలవాట్లు సంస్కృతుల నేపథ్యంలో ఆయా దేశాలు పీహెచ్‌డీఐలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు. 

మాంసం ద్వారానే కర్బన ఉద్గారాలు
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచ గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాల్లో ఆహార ఉత్పత్తి రంగం వాటా 35 శాతం ఉంది. వీటిలో 57 శాతం మాంసం, పాల ఉత్పత్తుల నుంచే వస్తోంది. ఒక కిలో ఆహారంలో కర్బన ఉద్గారాలు గొడ్డు మాంసం వల్ల అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. ఆ తర్వాత గొర్రె, షెల్ఫిష్, డెయిరీ ఉత్పత్తులు ప్రాసెసింగ్, రవాణాతో మరిన్ని ఉద్గారాలు వెలువడుతు­న్నాయి. వీటికి పూర్తి భిన్నంగా గింజలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు కిలో గ్రాము ఆహారానికి అతి తక్కువ మొత్తంలో కర్బన ఉద్గారా లను ఉత్పత్తి చేస్తాయి.

ఫలితంగా మొక్కల ఆధారిత ఆహారం పర్యావరణంపై చేసే నష్టం తక్కువగా ఉంటుంది. మాంసాహారం కోసం విచ్చలవిడిగా పశువుల ను పెంచడం పెను సమస్యలను తెచ్చిపెడుతోంది. పశువులకు కావాల్సిన ఆహారం కోసం/పశుగ్రాసం పెంచడానికి అడవుల నరికివేతతో వాతావరణంలోకి టన్నుల కొద్దీ కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలవుతోంది. పశువులు, గొర్రెలు, మేకలు ఆహారాన్ని జీర్ణం చేసే టప్పుడు గాలిలో మీథేన్‌ విడుదల పెరిగిపోతోంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)