Breaking News

తగ్గిన విద్యుత్‌ వినియోగం

Published on Sun, 05/19/2024 - 05:39

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ వేడి తగ్గింది. ఫలితంగా కరెంటు వినియోగం కూడా తగ్గింది. అది కూడా సాధారణంగా కాదు. ఈ ఏడాది వేసవిలో ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్‌.. వాతావరణం అనుకూలించడంతో తగ్గుదలలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 211 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం అవుతోంది. గతేడాది ఇదే సమయానికి 248.985 మిలియన్‌ యూనిట్ల వినియోగంతో పోలిస్తే.. ప్రస్తుతం ఇది 15.26 శాతం తక్కువగా నమోదైంది.

ఈ నెల ప్రారంభంలో విద్యుత్‌ డిమాండ్‌ రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా పైపైకి పరుగులు తీసింది. భానుడి భగభగలను తట్టుకోలేని ప్రజలు ఏసీలు, ఫ్యాన్లను ఆపాలంటేనే భయపడిపోయారు. ఈ నెల 5న రోజువారీ డిమాండ్‌ 259.173 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. 

ఇది గతేడాది జరిగిన వినియోగం 193 మిలియన్‌ యూనిట్ల కంటే 34.29 శాతం ఎక్కువ.  అయినప్పటికీ రాష్ట్రంలో వినియోగదారులకు అవసరమైనంత విద్యుత్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కడా కోతలు లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ సరఫరా చేయడంలో విజయవంతమైంది.

అత్యధికంగా థర్మల్‌ ఉత్పత్తి 
కొద్దిరోజుల క్రితం వరకూ రాష్ట్రంలో సౌర విద్యుత్‌ భారీగా పెరిగి దాదాపు రెట్టింపు విద్యుత్‌ను అందించేది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో అది కాస్త తగ్గింది. అనూహ్యంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెరిగింది. ప్రస్తుతం ఏపీ జెన్‌కో థర్మల్‌ నుంచి 95.221 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సమకూరుతోంది. అంటే రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌లో దాదాపు 45 శాతం జెన్‌కో థర్మల్‌ కేంద్రాల నుంచే వస్తోంది. 

ఇందుకోసం వీటీపీఎస్‌లో 48,141 మెట్రిక్‌ టన్నులు, ఆరీ్టపీపీలో 28,984 మెట్రిక్‌ టన్నులు, కృష్ణపట్నంలో 18,313 మెట్రిక్‌ టన్నుల చొప్పున బొగ్గు అందుబాటులో ఉంది. దీనికి తోడు ఏపీ జెన్‌కో హైడల్‌ నుంచి 4.63 మి.యూ., ఏపీ జెన్‌కో సోలార్‌ నుంచి 1.98 మి.యూ. వస్తోంది. ఇక సెంట్రల్‌ జనరేటింగ్‌ స్టేషన్ల నుంచి 32.999 మి.యూ., సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్‌ వంటి ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్ల నుంచి 30.939 మి.యూ., విండ్‌ నుంచి 10.937 మి.యూ., సోలార్‌ నుంచి 15.738 మిలియన్‌ యూనిట్ల చొప్పున సమకూరుతోంది. 

సౌర విద్యుత్‌ గత వారంతో పోలిస్తే దాదాపు సగానికిపైగా పడిపోయింది. మరోవైపు బహిరంగ మార్కెట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా సగానికిపైగా తగ్గింది. ప్రస్తుతం యూనిట్‌ సగటు రేటు రూ.8.433 చొప్పున రూ.17.983 కోట్లతో 21.324 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)