Breaking News

వైఎస్‌ జగన్‌ ఘనత.. 2022–23లో ఏపీలో తగ్గిన పేదరికం

Published on Sun, 08/25/2024 - 09:01

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం, రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధి మెరుగుపడింది. తద్వారా వారి పేదరికం జాతీయ స్థాయి కన్నా తక్కువగా నమోదైంది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2022–23 నాటికి పేదరికం నిష్పత్తిని ఈ నివేదిక విశ్లేషించింది. 

గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో పేదరికం 7.10 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.62 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఐదు శాతం కన్నా దిగువున ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 4.40 శాతం ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా పేదరికం తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొంది. 

దీనికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను నిర్మించడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడమని స్పష్టం చేసింది. వీటి ద్వారా గ్రామీణ జీవనోపాధిని గణ­నీయంగా మెరుగు పరచిందని నివేదిక తెలి­పిం­ది. ప్రభుత్వాలు అమలు చేసిన కార్య­క్రమాలతో  పేదరికం తగ్గడంతో పాటు గ్రామీ­ణ, పట్టణ పేదల జీవనోపాధి మెరుగుపడిందని నివేదిక స్పష్టం చేసింది. అలాగే జాతీయ స్థాయిని మించి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాల్లో పేదరికం ఉందని పేర్కొంది.

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)