Breaking News

ఘాటెక్కిన ఉల్లి

Published on Tue, 06/11/2024 - 05:20

సాక్షి, భీమవరం: ఉల్లి ధర ఘాటెక్కింది. రిటైల్‌ మార్కె­ట్‌లో కేజీ ధర రూ.40 నుంచి రూ.45 వరకు పలుకుతోంది. మహారాష్ట్ర మార్కెట్‌ నుంచి దిగుమతులు తగ్గడమే ధర పెరుగుదలకు కారణమని వ్యా­పా­రులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే పేరొందిన తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్‌కు షోలాపూర్, నాసి­క్, పూణే, అహ్మద్‌నగర్‌ ప్రాంతాల నుంచి నిత్యం కనీసం 450 టన్నుల వరకు ఉల్లి దిగుమతులు జరుగుతుంటాయి.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపా­టు ఈశాన్య రాష్ట్రాల్లోని మార్కెట్లకు సైతం ఇక్క­డి నుంచే ఉల్లి ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రస్తు­తం రోజుకు 240 టన్నుల ఉల్లి మాత్రమే వస్తోంది. ఫలితంగా వారం రోజులుగా ధరలు పెరుగుతున్నా­యి. వారం క్రితం రిటైల్‌ మార్కెట్‌లో కేజీ రూ.20 నుంచి రూ.30 వరకు పలికిన ధరలు అమాంతం పెరిగాయి. ఆటోలపై ఇళ్లకు వచ్చి నాసి­రకం ఉల్లిని మూడు కిలోలు రూ.100కు విక్రయిస్తుండగా.. దుకాణాల వద్ద నాణ్యతను బట్టి కిలో రూ.­40 నుంచి రూ.45 వరకు అమ్మకాలు చేస్తున్నారు.

రెట్టింపైన కూరగాయల ధరలు 
కూరగాయల ధరలు సైతం రెట్టింపయ్యాయి. వేసవి ఎండలు గోదావరి లంకలు, మెట్ట ప్రాంతాల్లో సాగుచేసే కూరగాయ పంటలకు తీవ్ర నష్టం కలగజేశాయి. అధిక ఉష్ణోగ్రతలకు పూత మా­డిపోయి దిగుబడులు పడిపోయాయి. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయి. కిలో రూ.20 ఉండే వంకాయలు రూ.40కి చేరగా, బెండకాయలు రూ.24 నుంచి రూ.40కి, బీరకాయలు రూ.30 నుంచి రూ.50కి పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే క్యారెట్, బీట్‌రూట్, బంగాళా దుంప ధరలు నిలకడగా ఉండగా.. టమాటా రూ.20 నుంచి రూ.50కి పెరిగింది.

పాత నిల్వలు వస్తేనే..
ప్రస్తుతం ఉల్లి ధర పెరుగుదల తాత్కాలికమేనని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతు­న్నా­రు. నాలుగు రోజులుగా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు దిగుమతులు తగ్గాయని హోల్‌సేల్‌ వ్యాపారి సర్వేశ్వరరావు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మహారాష్ట్ర మార్కెట్‌లోకి పాత నిల్వలు రానున్నట్టు అక్కడి వ్యాపారు­లు చెబుతున్నారన్నారు. అవి ఇక్కడి మార్కెట్‌కు చేరితే శుక్రవారం నాటికి ధరలు దిగివచ్చే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)