Breaking News

డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీ

Published on Sun, 12/31/2023 - 04:37

సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్‌–2, గ్రూప్‌–1, పాలిటెక్నిక్, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న ఏపీపీఎస్సీ.. తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 11 సబ్జెక్టుల్లో 240 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా పోస్టులు, విద్యార్హతలు, వేతనం, పరీక్ష విధానం తదితర వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో జనవరి 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (పేపర్‌–1) 150 మార్కులకు డిగ్రీ స్థాయిలో ఉంటుంది. పేపర్‌–2 సంబంధిత సబ్జెక్టు పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి మైనస్‌ మార్కులు ఉంటాయని కమిషన్‌ పేర్కొంది. అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల సబ్జెక్టు సిలబస్‌  https://psc.ap.gov.inలో చూడవచ్చు.  
 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)