Breaking News

మదనపల్లి మార్కెట్ యార్డులో కిలో టమాటా రూ.196

Published on Sat, 07/29/2023 - 19:23

సాక్షి, మదనపల్లె: మదనపల్లె మార్కెట్‌ చరిత్రలో పాత రికార్డులన్నింటినీ బద్దలు కడుతూ.. తాజాగా టమాటా కిలో రూ.196 ధర పలికింది. టమాటా ధర మరింత పెరుగుతూ రికార్డుల మోత మోగిస్తోంది. మార్కెట్లో ఇప్పటికే ఆకాశాన్ని అంటిన టమాటా ధర.. తాజాగా శనివారం మరింత పెరిగింది. మొదటి రకం టమాటాకు ఈ రేటు పలకగా.. నాణ్యత కాస్త తక్కువగా ఉన్న టమాటాలకు కిలో రూ.140 పలికింది. మార్కెట్‌కు తక్కువ మొత్తంలో సరుకు రావడంతో ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు.

దేశం మొత్తం మీద ప్రస్తుతం టమాటా మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, గుర్రంకొండ, అంగళ్లు, ములకలచెరువు.. కర్ణాటకలోని కోలారు, వడ్డిపల్లె మార్కెట్లలో మాత్రమే లభ్యమవుతోంది. దేశవ్యాప్తంగా టమాటాకు ఉన్నటువంటి డిమాండ్‌ దృష్ట్యా ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, చత్తీస్‌గడ్‌, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఈ ప్రాంతాల్లో మకాం వేసి అధిక ధరలకు టమాటాను కొనుగోలు చేస్తున్నారు. వచ్చిన సరుకు వచ్చినట్లే అధిక ధరలకు అమ్ముడవుతుండటంతో తీసుకొచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: బాబు అండ్‌ బ్యాచ్‌ ఓవరాక్షన్‌.. నిర్మల సీతారామన్‌ చెప్పింది విన్నారా?

రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో మదనపల్లె మార్కెట్లో రైతుల నుంచి సగటున కిలో రూ.104 చొప్పున టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు కిలో రూ.50 చొప్పున విక్రయిస్తోంది. ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు మరో నెలవరకు ఇలాగే కొనసాగుతాయని, అప్పటికి మదనపల్లె మార్కెట్‌లో సీజన్‌ పూర్తయితే అనంతపురం, డోన్‌, గుత్తి మార్కెట్లలో సరుకు లభ్యత వస్తుందన్నారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)