Breaking News

ఉష్ణతాపం ఉగ్రరూపం 

Published on Thu, 04/25/2024 - 17:12

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణతాపం మరింత ఉగ్రరూపం దాల్చనుంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఎండ కాక పుట్టిస్తోంది. తీవ్ర వడగాడ్పులు దడ పుట్టిస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. రానున్న ఐదు రోజులు వడగాడ్పులు మరింత ఉధృతం కానున్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశాలున్నాయి. బుధవారం అత్యధికంగా విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. బలపనూరు (వైఎస్సార్‌)లో 44.9, దొనకొండ (ప్రకాశం)లో 44.3, మహానంది (నంద్యాల)లో 44.2, రావికమతం (అనకాపల్లి)లో 44.1, కంభంపాడు (ఎన్టీఆర్‌), రావిపాడు (పల్నాడు)లలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

69 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 105 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. గురువారం 54 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 154 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటిలో తీవ్ర వడగాడ్పులు వీచే మండలాలు శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం జిల్లాలో 23, పార్వతీపురం మన్యంలో 12, ఏఎస్సార్‌ జిల్లాలో 2, అనకాపల్లిలో 3, విశాఖలో 1 (పద్మనాభం) మండలాలు ఉన్నాయని పేర్కొంది.

శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరం జిల్లాలో 4, పార్వతీపురం మన్యంలో 3, ఏఎస్సార్‌ జిల్లాలో 12, విశాఖపట్నంలో 3, అనకాపల్లిలో 15, కాకినాడలో 17, కోనసీమలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 19, పశి్చమ గోదావరి జిల్లాలో 4, ఏలూరులో 14, కృష్ణాలో 9, ఎన్టీఆర్‌లో 5, గుంటూరులో 14, పల్నాడులో 5, బాపట్లలో 1, నెల్లూరులో 1, ప్రకాశంలో 1, తిరుపతి జిల్లాల్లో 3 మండలాల్లో వడ­గాడ్పులు వీయవచ్చని వివరించింది. శుక్రవారం 36 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 157 మండలాల్లో వడగాడ్పులు వీచే ఆస్కారం ఉందని తెలిపింది.   

కొనసాగుతున్న ఆవర్తనం, ద్రోణి 
మరోవైపు తెలంగాణ, కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో గురువారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉక్కపోత, తేమతో కూడి అసౌకర్య వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)