వేట నిషేధ భృతి నిబంధనలు మార్పు

Published on Wed, 04/23/2025 - 04:55

సాక్షి, అమరావతి: ‘గంగపుత్రులకు తీరని అన్యాయం.. వేటకు వెళ్లే మత్స్యకారులకు సంక్షేమ పథకాలు కట్‌’ పేరుతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో కూటమి ప్రభుత్వం దిగివచ్చింది. ‘వేట నిషేధ భృతి’కి అర్హుల గుర్తింపు కోసం జారీ చేసిన నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. భృతికి ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ స్కీమ్‌(మత్స్యకార పెన్షన్‌) పొందే వారు మాత్రమే అనర్హులని.. మిగిలిన సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది. ఇతర నిబంధనలను కొంతమేర సడలించింది.  

కలకలం రేపిన ఉత్తర్వులు.. 
సముద్రంలో మత్స్యసంపద వృద్ధి కోసం ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమలవుతుంటుంది. ఈ దృష్ట్యా జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాల పోషణ కోసం ప్రభుత్వం పరిహారం ఇచ్చేది. గతంలో రూ.4 వేలు ఉన్న వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మత్స్యకారులకు అందించింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా 5.38 లక్షల మందికి రూ.538 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. 

అలాగే వేట నిషేధ భృతి పొందిన వారికి సైతం అన్ని సంక్షేమ పథకాలనూ వర్తింపజేశారు. అధికారంలోకి వస్తే భృతిని రూ.20 వేలకు పెంచి ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. తొలి ఏడాది ఎగ్గొట్టింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి వారం రోజుల క్రితం మార్గదర్శకాలు జారీ చేసింది. కుటుంబంలో ఒకరికి మాత్రమే వేట నిషేధ భృతి ఇస్తామని.. ఈ భృతి పొందే వారు ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని ప్రకటించింది. 

ఈ నిబంధనలను ప్రశ్నిస్తూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కల­కలం రేపింది. నిబంధనలు మార్చాలంటూ మత్స్య­­కా­­రులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం నిబంధనలను మారుస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

మారిన నిబంధనలు.. 
వేటకు వెళ్లే బోట్లన్నీ ఏప్రిల్‌ 14కు ముందు ఎంఎస్‌ యాక్టు 1958 కింద రిజిస్టరై ఉండాలని.. ఎఫ్‌ఎంఎఫ్‌ఆర్‌ యాక్టు 1995 కింద లైసెన్స్‌ సర్టిఫికెట్‌ పొంది ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. సబ్సిడీ ఆయిల్‌ ఎంత వినియోగించుకున్నా అర్హులేనని స్పష్టం చేసింది. కాగా, వేట నిషేధ భృతి పొందేవారు ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్‌ విద్యోన్నతి, ఎనీ్టఆర్‌ భరోసా పెన్షన్‌ పొందేందుకు అనర్హులని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఒక్క ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ స్కీమ్‌(మత్స్యకార పింఛన్‌) పొందే వారు మాత్రమే అనర్హులంటూ నిబంధనల్లో మార్పులు చేసింది. 

అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 1.20 లక్షలు, అర్బన్‌ ప్రాంతంలో 1.44 లక్షల ఆదాయానికి మించి ఉండకూడదని.. 3 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట లేదా 10 ఎకరాల్లోపు మెట్ట, మాగాణి కలిసిన భూములు, 4 చక్రాల వాహనాలు, ఏడాదిలో గరిష్టంగా నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగం, కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంత ఇల్లు కలిగిన వారు అనర్హులని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం ఆ నిబంధనల స్థానంలో గతంలో మాదిరిగా 6 దశల వెరిఫికేషన్‌ ద్వారా అర్హులను గుర్తిస్తామని స్పష్టం చేసింది.

రూ.40 వేలు జమ చేయాలి.. 
తాజా నిబంధనల ప్రకారం బుధవారం(23వ తేదీ) సాయంత్రంలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని మత్స్యశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగే కార్యక్రమంలో ఈ ఏడాది వేట నిషేధ భృతి జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది ఎగ్గొట్టిన రూ.20 వేలు కూడా కలిపి రూ.40 వేలు జమ చేయాలని మత్స్యకార సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)