Breaking News

అసలైన దోషులను అరెస్ట్‌ చేయాలి

Published on Tue, 07/30/2024 - 04:46

నరసరావుపేట: తమ కుమారుడి హత్యలో ప్రమేయం ఉన్న వారి పేర్లు చెప్పినా ఇప్పటివరకు తమకు న్యాయం చేయలేదని వినుకొండలో హత్యకు గురైన రషీద్‌ తల్లి బడేబీ ఆవేదన వ్యక్తం చేశారు. వారి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి.. వెంటనే అరెస్ట్‌ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు రషీద్‌ తల్లిదండ్రులు పరేషా, బడేబీలు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బిడ్డను కోల్పోయి తామంతా పుట్టెడు దుఃఖంలో ఉంటే.. తన కుటుంబంపై పరువునష్టం దావా వేస్తామంటూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇంకా ఇలా వేధించడం కంటే ఒక్కసారిగా ‘మమ్మల్ని కూడా నరికించండి’.. అంటూ విలపించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ‘ఇప్పుడు కొమ్మలే నరికాం..  భవిష్యత్తులో మొదలు నరుకుతాం.. ’ అని ప్రకటిస్తున్నారంటే తనను కూడా తుదముట్టించాలనే ఆలోచన వారికి ఉందని.. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉండి తీరతానని  స్పష్టం చేశారు. 

రషీద్‌ హత్యకు ప్రేరేపించిన వారిని పక్కన పెట్టి ఎవరెవరినో అరెస్ట్‌ చేశారని విమర్శించారు. అసలైన నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. రషీద్‌ రౌడీషీటర్‌ అని ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి అతడు  సౌమ్యుడని, గొడవలకు వెళ్లే వ్యక్తి కాదన్నారు. తన స్వగ్రామం వేల్పూరులో 30 మంది పోలీసులను పెట్టినా.. టీడీపీకి ఓటేయలేదన్న కారణంతో  టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని బొల్లా ఆందోళన వ్యక్తం చేశారు. 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)