Breaking News

నోట్‌ బుక్స్‌ తెచ్చుకోకుండా ఎలా వస్తారు..!

Published on Thu, 07/10/2025 - 08:16

నంద్యాల: నంద్యాల ఆర్డీవో వ్యవహార శైలి వివాదాస్పదమైంది. బీఎల్‌వోలను కించపరచడంతో పాటు కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మైకు విసరబోవడం, దుర్భాషలాడటం చర్చనీయాంశంగా మారింది. వివరాలివీ.. నంద్యాల జిల్లా మండల కేంద్రం చాగలమర్రిలోని వాసవీ కళ్యాణ మండపంలో మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బిఎల్‌వోలకు ఒక్క రోజు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.

 ఈ కార్యక్రమానికి  ఆర్డీవో విశ్వనాథ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాస్టర్‌ ట్రైనర్‌ సునీల్‌పై కేకలు వేశారు. బీఎల్‌వోలకు శిక్షణ సరిగ్గా ఇవ్వడం లేదంటూ ఇందుకేనా ప్రభుత్వం మిమ్మల్ని శిక్షణకు ఢిల్లీకి పంపిందని ప్రశ్నించారు. విధి నిర్వహణకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవడానికి డైరీలు, నోట్‌ బుక్స్‌ తెచ్చుకోకుండా ఎలా వస్తారని ప్రశ్నించారు. నోట్‌ బుక్స్‌ తెచ్చుకోని వీఆర్‌ఓలను విద్యార్థుల్లా నిల్చోబెట్టి పొడుపు కథలు చెప్పారు.  

ఇది మా కార్యక్రమం.. మీరెందుకొచ్చారు? 
శిక్షణ కార్యక్రమం కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా ఆర్డీఓ విశ్వనాథ్‌ దురుసుగా ప్రవర్తించారు. ఇది మా సిబ్బందికి సంబంధించినదని, మీరు బయటికి వెళ్లండంటూ గట్టిగా అరిచారు. అక్కడితో ఆగకుండా  చేతిలోని మైకును విసరబోయారు. పక్కనే ఉన్న స్థానిక తహసీల్దార్‌ వారించడంతో ఆర్డీఓ కోపోద్రిక్తుడై దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


 

 

#

Tags : 1

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)