Breaking News

ఏపీలో అభివృద్ధి వ్యయం పరుగులు.. ఆర్బీఐ అధ్యయన నివేదికలో వెల్లడి

Published on Fri, 01/20/2023 - 02:17

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి వ్యయం గత మూడేళ్లుగా పెరుగుతుండగా అభివృద్ధియేతర వ్యయం ఏటా తగ్గుతోందని ఆర్బీఐ అధ్యయన నివే­దిక వెల్లడించింది. వడ్డీల చెల్లింపుల వ్యయం కూడా మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి తగ్గుతోందని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై రూపొందించిన అధ్యయన నివేదికను ఆర్బీఐ విడుదల చేసింది. 2020 – 21 నుంచి 2022 – 23 వరకు ప్రధాన ఆర్థిక సూచికలను విశ్లేషించింది. సామా­జిక సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది.

సామా­జిక, ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలపై వెచ్చించే నిధులను అభివృద్ధి వ్యయంగా పరిగణించాలని పేర్కొంది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య తది­తరా­లపై చేసే వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా పరిగణి­స్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి వైద్యం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం.. నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాలపై వ్యయం పెరుగుతోంది. 2021 – 22 నుంచి 2022 – 23 వరకు మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం ఏటా పెరుగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మించి రాష్ట్రం అభివృద్ధి వ్యయం చేస్తోంది. 

► 2020 – 21 (అకౌంట్స్‌)లో మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం 63.0 శాతం ఉండగా 2022 – 23 బడ్జెట్‌ అంచనాల ప్రకారం 72.0 శాతానికి పెరిగింది. 
ఇదే సమయంలో అభివృద్ధియేతర వ్యయం 29.7 శాతం నుంచి 21.6 శాతానికి తగ్గింది. 
► 2020 – 21 రెవెన్యూ వ్యయంలో వడ్డీల చెల్లింపుల వ్యయం 13.1 శాతం ఉండగా 2022 – 23 బడ్జెట్‌ అంచనాల్లో 10.2 శాతానికి తగ్గింది. 
► ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుధ్య వ్యయం 2020 – 21లో రూ.9,990.6 కోట్లు ఉండగా 2021–22లో రూ.16,659.5 కోట్లకు పెరిగింది. 2022–23లో రూ.17,988.2 కోట్లకు చేరుకుంది.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)