Breaking News

ఉపాధిలో వ్యవసాయమే మేటి

Published on Mon, 02/24/2025 - 05:25

సాక్షి, అమరావతి: దేశంలో ఉపాధి అవకాశాల కల్పనలో ఇప్పటికీ వ్యవసాయ రంగమే అగ్రగామిగా ఉన్నట్లు రిజర్వు బ్యాంకు రూపొందించిన నివేదిక వెల్లడించింది. 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేసిన తరువాత దేశంలో ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తృ­తమయ్యాయి. దీంతో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడే వారి శాతం తగ్గినప్పటికీ నేటికీ అత్యధిక శాతం మందికి ఇవే ఉపాధి కల్పిస్తుండటం గమనార్హం. 

దేశంలో వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను ఆర్బీఐ ‘పీరియడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ (పీఎల్‌ఎఫ్‌)’ సర్వే నివేదిక వెల్లడించింది. రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గగా ఐటీ కంపెనీలు, ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది.

పీఎల్‌ఎఫ్‌ నివేదికలోని ప్రధానాంశాలు..
1993–94లో దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై 64 శాతం మంది ఆధారపడగా 2018–19 నాటికి అది 42.5 శాతానికి తగ్గింది. 2023–24 నాటికి మాత్రం వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు 
పొందుతున్న వారి సంఖ్య కొంత పెరిగి 46.2 శాతంగా నమోదైంది.

అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా భారతీయ రైల్వే తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అయినప్పటికీ రైల్వేలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 1991–92లో రైల్వే శాఖలో 16.52 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2023–24లో 11.90 లక్షలకు తగ్గింది.

బ్యాంకింగ్‌ రంగంలోనూ ఉపాధి అవకాశాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 1991–92లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 8.47 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ప్రైవేట్‌ బ్యాంకుల్లో 63 వేల మంది మాత్రమే ఉన్నారు. కానీ 2023–24 నాటికిప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కంటే ప్రైవేట్‌ బ్యాంకుల్లోనే ఉద్యోగులు ఎక్కువ మంది ఉండటం గమనార్హం. 2023–24లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7.46 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో 8.74 లక్షల మంది పని చేస్తున్నారు.

ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్‌ మహీంద్రాలో 2020 నాటికి 11.49 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2024 డిసెంబర్‌లో వీరి సంఖ్య 15.34 లక్షలకు చేరుకుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)