Breaking News

సొమ్ము స్పాన్సర్లది సంబరం సర్కారుది

Published on Thu, 02/06/2025 - 07:24

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రథసప్తమి వేడుకలు ముగిశాయి. రాష్ట్ర పండగగా ప్రకటించిన ప్రభుత్వం పైసా విడుదల చేయకపోయినా స్పాన్సర్ల సహకారంతో విజయవంతమయ్యాయి. ఒక వైపు దేవస్థానానికి విరాళాలిచ్చిన దాతల డోనర్‌ పాసుల విషయంలోనూ, సంప్రదాయంగా దర్శనం కల్పించడంలోనూ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించినప్పటికీ జిల్లాలోని మిగతా వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సాయంతో పండగను సక్సెస్‌ చేసింది. 

నగరంలో జరిగిన అభివృద్ధి పనుల నుంచి విద్యుత్‌ కాంతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతరత్రా అలరించే ప్రోగ్రామ్స్‌ వరకు దాతలే దిక్కయ్యారు. జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో స్పాన్సర్స్‌ కావాలని వివిధ వర్గాలతో నిర్వహించిన సమావేశం సత్ఫలితాలను ఇచ్చింది. అధికారుల మాట కాదంటే టార్గెట్‌ అయిపోతామేమోననో.. ఇబ్బందులొస్తాయనో, దేవుడు కార్యక్రమానికి అడిగినప్పుడు సాయం చేయడం మంచిదనో తెలియదు గానీ జిల్లా యంంత్రాంగం అడిగిన వెంటనే ప్రతీ ఒక్కరూ పోటీ పడి సాయం చేశారు. అయితే, ఆ సాయం ఎంతనేది అధికారులే లెక్క చెప్పాలి.   

No Headline
అంతా అధికారులే.. 
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో వేడుకల నిర్వహణ బాధ్యతను అధికారులే తీసుకున్నారు. కార్పొరేషన్, సుడా నిధులతో కొంతమేర అభివృద్ధి పనులు చేసినా అవి పూర్తయ్యేందుకు కూడా స్పాన్సర్లసాయం తీసుకున్నట్టు సమాచారం. ఇక, వేడుకలు విజయవంతంగా జరగడానికి సాంస్కృతిక, క్రీడా పోటీలు, విద్యుత్‌ కాంతులు, హెలికాప్టర్‌ రైడింగే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. హెలికాప్టర్‌ రైడింగ్‌ ఒక్కొక్కరికీ రూ.1800 టికెట్‌ పెట్టడంతో గతంలో ఎన్నడూ ఎక్కని వారంతా ఒక్కసారైనా పయనించాలని ఆరాట పడ్డారు. డబ్బులను లెక్క చేయకుండా రైడింగ్‌ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీల నిర్వహణ, బహుమతులు అందజేయడంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం ఉంది. అట్టహాసంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు జ్యూయలరీ, వస్త్ర, ఇతరత్రా బడా వ్యాపారులు ఆర్థికంగా సాయపడ్డారు. ఇక, లేజర్‌ షో, క్రాకర్స్, హాస్యనటుల ప్రోగ్రాం, సింగర్‌ మంగ్లీ ఈవెంట్‌ కూడా దాదాపు దాతల సహకారంతోనే జరిగినట్టు సమాచారం.  

సమన్వయంతో నిర్వహణ.. 
రాష్ట్ర, జిల్లా అధికారులు కూడా సమన్వయంతో వ్యవహరించారు. ముఖ్యంగా సింహాచలం దేవస్థానం, విశాఖ కనకమహలక్ష్మీ దేవస్థానం, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి, విజయనగరం పైడితల్లి అమ్మవారు, శంబర పోలమాంబ ఉత్సవాలతో పాటు అరకు ఉత్సవాలకు వినియోగించిన అనేక శకటాలను ఇక్కడికి తెప్పించి శోభాయాత్రను విజయవంతం చేశారు. ఇందులో దేవదాయ శాఖ అధికారులు కీలక పాత్ర పోషించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి ముందుండి నడిపించగా.. జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ వై.భద్రాజీ తదితరులు తమవంతు శాయశక్తులా పనిచేశారు. ఒకవైపు ఆలయానికి విరాళాలు ఇచ్చిన దాతలపై చిన్న చూపు చూసినప్పటికీ,  ప్రభుత్వం పైసా విడుదల చేయకుండా చేతులు దులుపుకున్నా.. ఉత్సవాల నిర్వహణ భారాన్ని దాదాపు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలే మోశారు. ప్రభుత్వంతో పనిలేకుండా దాతల సహకారంతో ఎంతటి కార్యక్రమాన్నైనా విజయవంతం చేయవచ్చనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.    

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)