Breaking News

బంగారు 'మేషువా'.. ‘అల్లూరి’ జిల్లాలో అరుదైన వృక్షాలు

Published on Fri, 09/09/2022 - 04:06

హుకుంపేట (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో తూర్పు కనుమల్లో పలు చోట్ల ఔషధ గుణాలున్న అరుదైన మేషువా ఫెరే చెట్లు విస్తరించి ఉన్నాయి. ఈ చెట్లను గిరిజనులు ఉప్ప, బంగారం చెట్లుగా పిలుస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బంగారం గరువు అనే చిన్న గ్రామంలో సుమారు 25 ఎకరాల్లో 1,500 చెట్లున్నాయి. ఈ చెట్ల వల్లే అక్కడ ఉన్న గ్రామానికి బంగారం గరువు అని పేరొచ్చింది.

ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1,050 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ వృక్ష జాతి వైద్య, వాణిజ్య పరంగా చాలా విలువైంది. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య ఇవి చిగురిస్తాయి. ఆసక్తికర విషయమేంటంటే ఈ చెట్లు చిగురించేప్పుడు వాటి ఆకులు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ ఆకులు మొదట లేత ఎరుపు రంగు, తర్వాత గోధుమ రంగు, ఆ తర్వాత లేత ఆకుపచ్చ రంగు, చివరిగా పూర్తి ఆకుపచ్చ రంగులోకి మారతాయి. వీటి పువ్వులు తెలుపు రంగులో పెద్దవిగా ఉంటాయి. వీటిని గిరిజన స్త్రీలు అలంకరణ కోసం వినియోగిస్తారు. మంచి సువాసన ఉండటంతో వాణిజ్య పరంగా సుగంధ ద్రవ్యాల తయారీలో వినియోగిస్తున్నారు.  

ఈ చెట్లను గిరిజనులు నరకరు 
ఈ పువ్వులు ఫలదీకరణం చెంది పూర్తి ఫలాలుగా మారేందుకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. ఒక్కో ఫలంలో ఒకటి నుంచి నాలుగు గింజలుంటాయి. ఇవి నూనె స్వభావం కలిగి ఉండటం వల్ల కాల్చినప్పుడు కొద్ది సమయం పాటు వెలుగుతాయి. గతంలో ఈ గింజలను అక్కడి గిరిజనులు వెలుగు కోసం వినియోగించేవారు. వీటి నుంచి తీసిన నూనెను తలకు రాసుకోవడానికి, దీపాలు వెలిగించేందుకు, చర్మ వ్యాధుల నివారణకు వినియోగిస్తారు.

ఈ చెట్లు ఉన్న స్థలంలో పూర్వం నుంచి ఓ ఆలయం ఉంది. ఆలయంలో ఉన్న దేవతను గంగమ్మగా కొలుస్తారు. ఆ ప్రాంతంలో జాతర నిర్వహిస్తారు. ఈ స్థలాన్ని అటవీశాఖ రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటించింది. ఈ వృక్షాలను నరికేందుకు గిరిజనులు ఇష్టపడరు. అయితే ఏటా గిరిజనులు ఆ చెట్ల పువ్వులను, గింజలను వివిధ అవసరాలకు సేకరించడం వల్ల కొత్త మొక్కలు పుట్టడం లేదు. ఇది ఆ వృక్ష జాతి మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ చెట్లను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.. 
అత్యంత ఔషధ గుణాలున్న ఉప్ప చెట్లను పరిరక్షించాల్సిన అవసరముంది. ఏటా గిరిజనులు ఆ చెట్ల పువ్వులను, గింజలను వివిధ అవసరాలకు సేకరించడం వల్ల కొత్త మొక్కలు పుట్టడం లేదు. ఇది ఆ వృక్ష జాతి మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి     
– డాక్టర్‌ సమరెడ్డి శ్రావణ్‌కుమార్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్,ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్, బాబా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విశాఖపట్నం 

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి కృషి 
దేశంలోనే అరుదైన ఉప్ప చెట్లు ఉన్న ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఈ ప్రాంతం అభివృద్ధికి ఇప్పటికే  పలుమార్లు ఉన్నతాధికారులతో చర్చించాం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి పర్యాటక ప్రాంతంబబగా అభివృద్ధి చేస్తాం.  
 – చెట్టి పాల్గుణ, అరకు ఎమ్మెల్యే 

Videos

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)