Breaking News

ఏపీలో అరుదైన క్షీరదం గుర్తింపు

Published on Thu, 05/16/2024 - 05:36

అనంతపురం: కొత్త చిట్టెలుక జాతికి చెందిన క్షీరదాన్ని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జువా­లజీ విభాగానికి చెందిన టీచింగ్‌ అసిస్టెంట్‌ డాక్టర్‌ బాలసుబ్రమణ్యం గుర్తించారు. అరుదైన జాతికి చెందిన క్షీరదంగా నిర్ధారించారు. పొడుచుకు వచ్చి­నట్టు ఏనుగు తొండంలా, కదలికలు గల మూతి భాగం(రోష్ట్రం) నిర్మాణ శైలిని కలిగి వెడల్పాటి చెవులు, ఒంటె మూపురం వంటి దేహ నిర్మాణం కలిగి ఉంది.

సొరిసిడే కుటుంబానికి చెందిన ఈ క్షీరదం భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. దీని సహజ నివాసం ఉష్ణ లేదా ఉష్ణమండల పొడి అడవులు మాత్రమే. డీఎన్‌ఏ అనాలిసిస్‌ కోసం వైల్డ్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డెహ్రాడూన్‌)కు పంపించారు. 

ఇప్పటి దాకా పేరు లేని జీవి
»  ప్రస్తుతం గుర్తించిన ఈ అరుదైన జీవికి ఇప్పటి దాకా ఎలాంటి పేరు లేదు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ 465 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో జీవ వైవిధ్యం పెంపొందించేలా మియావాకీ అడవులను పెంచుతున్నారు. ఇందులోనే దీనిని గుర్తించారు. 
»   ఈ జాతి అటవీ ప్రాంతాలు, వ్యవసాయ భూములు, మానవ కార్యకలాపాలకు సంబంధి­ంచిన ప్రాంతాలలో అరుదుగా కనిపిస్తుంది. రక్షిత ఆవాసాలలో గూడు కట్టుకుని నివసిస్తుంది. ఆకులు, అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర గూడు పదార్థాలను సేకరించి, ఆపై గూడును నిర్మించ­డానికి ఒక రహస్య ప్రాంతాన్ని కనుగొంటాయి. 
»   చిట్టెలుకలు ప్రధానంగా కీటకాహారులు. ఇవి 82 శాతం కీటకాలను తింటాయి. కొన్ని సార్లు మొక్కలను, విత్తనాలను తింటాయి. అలాగే అనేక రకాల అకశేరుకాలు, మానవ ఆహార పదార్థాలను కూడా తింటాయి. 
» ఇవి రాత్రి పూట ఎక్కువగా అడవులు, సాగు చేసిన పొలాలు, మానవ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఆహారం తీసుకుంటాయి. కీటకాలు, తెగుళ్లు రాకుండా అరికడతాయి. రైతులకు కీటకాలను నియంత్రించడంలో దోహదం చేస్తాయి.

పొడి అడవుల్లో మాత్రమేజీవించే అరుదైన జీవి
కొత్త చిట్టెలుక జాతికి చెందిన క్షీరదాన్ని ఎస్కేయూలో గుర్తించాం. పొడి అడవుల్లో మాత్రమే జీవించే అరుదైన జీవి ఇది. డీఎన్‌ఏ అనాలిసిస్‌ కోసం వైల్డ్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(డెహ్రాడూన్‌)కు పంపాము.– డాక్టర్‌ బాలసుబ్రమణ్యం, జువాలజీ విభాగం టీచింగ్‌ అసిస్టెంట్, ఎస్కేయూ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)