Breaking News

మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ డుమ్మా

Published on Wed, 07/05/2023 - 09:02

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజ కిరణ్‌ తాము గుంటూరులో సీఐడీ విచారణకు హాజరుకాలేమని తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో రామోజీరావు, రాలేని పరిస్థితుల్లో ఉన్నందున శైలజ కిరణ్‌ విచారణకు హాజరుకాలేమని ఈ–మెయిల్‌ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

చందాదారుల సొమ్మును చిట్‌ఫండ్స్‌ చట్టానికి విరుద్ధంగా సొంత ప్రయోజనాలకు మళ్లించడం, రిజర్వ్‌ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేసులో రామోజీరావు, శైలజ కిరణ్‌తోపాటు మరికొందరిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.   ఏపీలో ఉన్న చందాదారుల నిధులను అక్రమంగా మళ్లించారు.. కాబట్టి నిందితులిద్దర్నీ ఏపీలో విచారించడం సరైందని సీఐడీ అధికారులు భావించారు.
చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం

మరోవైపు.. హైదరాబాద్‌లో విచారణ సందర్భంగా సీఐడీ అధికారులను తమ నివాసంలోకి అనుమతించకుండా రామోజీరావు తన సిబ్బంది ద్వారా చాలాసేపు అడ్డుకోవడం గమనార్హం. దీంతో ఈ నెల 5న గుంటూరులో సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని రామోజీరావు, శైలజ కిరణ్‌లకు సీఐడీ అధికారులు సీఆర్‌పీసీ 41(ఏ) కింద గత నెల 22న నోటీసులు జారీచేశారు.
చదవండి: మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)