నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు
Breaking News
RGV: కాకినాడలో రామ్గోపాల్ వర్మ సందడి..
Published on Sun, 01/15/2023 - 12:44
సాక్షి, కాకినాడ: సంక్రాంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో రెండో రోజు కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. బరులలో కోడి పుంజులు కాళ్లు దువ్వుతున్నాయి. పందాల కోసం ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు తరలివచ్చారు. కాగా, సంక్రాంతి పండగ నేపథ్యంలో కాకినాడలో దర్శకుడు రామ్గోపాల్ వర్మ సందడి చేశారు.

వలసపాకలో కోడిపందాలను ఆయన తిలకించారు. పందెంలో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రామ్గోపాల్వర్మతో పాటు నటుడు కృష్ణుడు కూడా ఉన్నారు. ఆర్జీవీ రాకతో కాకినాడలో సందడి వాతావరణం నెలకొంది. స్థానికులు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి నివాసానికి చేరుకున్న ఆర్జీవీ.. అక్కడ అల్పహారం స్వీకరించారు. అనంతరం కోడిపందాలను ఆసక్తిగా తిలకించారు.

చదవండి: హైదరాబాద్ అల్లుడు.. భీమవరం మామ.. 173 రకాలతో..
Tags : 1